కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
కాంగ్రెస్ బస్సుయాత్రను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీటర్ వేదికగా కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ట్వీట్ ఇస్తూ…నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులకు కేరాఫ్ అడ్రస్ డ్రామారావు అని, పదేళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోదీ-కేడీ అని, కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది వాకేనని, కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది వారేనని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని దద్దమ్మలమని ఆయనే ఒప్పుకుంటున్నాడని పేర్కొన్నారు. తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదని తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన ట్వీట్‌లో రేవంత్ రెడ్డి…‘నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులు..కేరాఫ్ అడ్రస్ డ్రామారావు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ – కేడీ. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ – కేడీ. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ – కేడీ. విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని దద్దమ్మలం అని నీవే ఒప్పుకుంటున్నావు..తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదు.’ అంటూ మంత్రి కెటిఆర్‌కు కౌంటర్ ఇచ్చారు




