నిరంతర పరిశోధకులు ఇస్రో శాస్త్రవేత్తలు !

అంతరిక్షంలో విజయాలు అంత సులువుగా రావు. ఎంతో కఠోర పరిశ్రమ చేసినా ప్రకృతి ఒక్కోసారి వికటిస్తుంది. అందుకు చంద్రయాన్‌ `2 లో ఎదురైన సమస్యలే నిదర్శనం. కానీ తరవాత ప్రజ్ఞాన్‌ రోవర్‌ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయానంతో అద్భుతాన్ని సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, మరో అద్భుత విజయంతో ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. కృష్ణబిలాల రహస్యాన్ని ఛేదించే క్రమంలో చేసిన ప్రయోగంతో కొత్త ఏడాదిని ఇస్రో ఘనంగా ప్రారంభించింది. అయితే ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ పొంచి ఉంటాయి. అంతరిక్షంలో మనం భూవ్మిూద లాగా దూసుకుని పోలేం. అంచనాలు తలకిందులు అవుతాయి. ఒక్కోసారి విజయాలు వరిస్తాయి. ఇవన్నీ కూడా నిరంతర పరిశోధనల్లో భాగమే తప్ప ఇందులో విజయాలు, వైఫల్యాల లెక్కలకు తావు లేదు.

ఇస్రో శాస్రవేత్తలు నిరంతరపరిశోధకులు. వారి పరిశోధనలకు ప్రతి ఒక్కరు తలవంచి అభినందించాల్సిందే. చంద్రయాన్‌ విజయం తరవాత ఇస్రో చేస్తున్న కృషి అద్భుతంగా ఉంది. కాస్మిక్‌ ఎక్స్‌రేలను అధ్యయనం చేయడానికి భారతదేశం ఇలా అంతరిక్షంలోనే ఒక అబ్జర్వేటరీని ఏర్పాటు చేసుకుంది. అమెరికా మాత్రమే ఈ విషయంలో మనకంటే ముందున్నది..ఇప్పుడు ఇస్రో చేపట్టిన పరిశోధన తో మనం కూడా సగర్వంగా ముందుకు సాగే అవకాశం వొచ్చింది. కృష్ణబిలాలు, న్యూట్రాన్‌ స్టార్ల గురించి ఎంతోకొంత అవగాహన ఉన్నా, వాటి పుట్టుపూర్వోత్తరాల విషయంలో మనిషి నిరంతర అన్వేషణ సాగుతూనే ఉన్నది. ఆఖరికి  కాంతిని సైతం దిగమింగే బలమైన అయస్కాంత శక్తితో, లక్షలాది సూర్యుల ద్రవ్యరాశితో అంతులేని ఆకాశంలో అంతుచిక్కని బ్రహ్మ రహస్యమే కృష్ణబిలం. వాటినుంచి వెలువడే శక్తిమంతమైన ఎక్స్‌రేల ప్రవర్తనను సక్రమంగా విశ్లేషించినప్పుడు ఆవిర్భావక్రమాన్ని కొంతమేరకు అర్థం చేసుకోగలం. దీని గుట్టును కనుక్కునే లక్ష్యంతో ఇస్రో వేసిన అడుగు అద్భుతం అని చెప్పక తప్పదు.

ఎక్స్‌రే పొలారివిూటర్‌ సాటిలైట్‌ ఎక్స్‌పోశాట్‌ మన ఖగోళ అధ్యయనంలో ఒక అద్భుత పురోగతి. తన ఐదేళ్ళ జీవితకాలాన్ని ఇది ప్రధానంగా కృష్ణబిలాలను అధ్యయనం చేయడానికి వినియోగిస్తుంది. ఎక్స్‌రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్‌ తెలుసు కోవడం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్‌ స్టార్ల రేడియేషన్‌ గుట్టు విప్పుతుంది. అంతరిక్షంనుంచి వెలువడే యాభై రకాల కాంతిపుంజాలను అధ్యయనం చేయడానికి అంతరిక్షంలోనే ఓ అబ్జర్వేటరీని నెలకొల్పుకోవడం ఇస్రో చేస్తున్న సాహస పరిశోధనగా గుర్తించాలి. ఇస్రో గతేడాది చంద్రయాన్‌ విజయం తక్కువేవిూ కాదు. అత్యంత శక్తిమంతమైన బాహుబలి రాకెట్‌ను, సాంకేతికంగా అత్యున్నతమైన ఉపగ్రహాలను అభివృద్ధి చేసుకుంది. ఎక్స్‌పోశాట్‌ మాదిరిగానే, ఇటీవలి ఆదిత్య ఎల్‌1 కూడా స్పేస్‌ అబ్జర్వేటరీయే. జనవరి 6న ఆదిత్య ఎల్‌1 తన చిట్టచివరి విన్యాసాన్ని ముగించుకొని గమ్యాన్ని చేరబోతున్నది.ఆగస్టులో చంద్రయానం జరగ్గానే, సెప్టెంబర్‌ లోనే ఆదిత్యకు అంకురార్పణ చేయడం ఓ సాహసం. అత్యంత కఠినమైన చంద్రుడి దక్షిణ ధ్రువంలో సాప్ట్‌ల్యాండిరగ్‌ విజయవంతం చేయడం ఇస్రో కీర్తికిరీటంలో ఓ కలికితురాయి. చంద్రుడివిూదకు సున్నితంగా వాలే ఆ ’ఫిప్టీన్‌ మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’లో ఎదురయ్యే అవాంతరాలను ల్యాండర్‌ మాడ్యుల్‌ స్వయంగా అధిగమించే రీతిలో తయారు చేయడం ఇస్రో దూరదృష్టికి నిదర్శనం. ప్రయాణమార్గంలో అడ్డువచ్చిన అగాధాన్ని తనకుతానుగా తప్పించుకొని తిరిగి తనపని తాను చేసుకుపోయిన రోవర్‌ ప్రజ్ఞాన్‌ కూడా ఓ అద్భుతమే.
చంద్రయాన్‌, ఆదిత్య మాత్రమే కాదు, గత ఏడాది రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.

మానవ సహిత గగనయానికి అత్యంత కీలకమైన క్యూ ఎస్కేప్‌ మోడల్‌ పరీక్షను కూడా అది దిగ్విజయం చేసుకుంది. భారత అంతరిక్ష చరిత్రలో 2023 ఇస్రోకు విజయవంతమైన ఏడాది. చేతిలో 14ప్రాజెక్టులతో, మరిన్ని ఉన్నతమైన లక్ష్యాలతో ఈ కొత్త సంవత్సరంలో అది మరింత దూసుకుపోయేలా ప్రణాళికలు చేస్తోంది. భారతీయుల ఆకాంక్షలకు, విజ్ఞాన సామర్థ్యానికి, సాంకేతిక పరిణతికి నిదర్శనమైన ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై కాలుమోపటం ద్వారా.. మనదేశ సత్తాను మరోమారు యావత్‌ ప్రపంచానికి చాటిచెప్పింది. అంతరిక్ష పరిశోధనల చరిత్రలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్‌ దిగ్విజయంగా అడుగులు వేయడమన్నది ఇస్రో ఘన విజయానికి సూచిక. ఇప్పటికే రోదసి రంగంలో అనేక రికార్డులను నెలకొల్పింది. భారతీయుల ప్రతిభకు, చిత్తశుద్ధికి చంద్రయాన్‌ ఒక నిదర్శనంగా నిలుస్తుంనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మన శాస్త్రవేత్తలు గొప్ప విజయం సాధించారు. మన దేశాన్ని గర్వపడేలా చేశారు. ఈ ప్రపంచానికి, సైన్స్‌కు, సమస్త మానవాళికి ఎంతో సేవ చేశారు. మన ప్రయాణం మరింత ధృడంగా కొనసాగించే సత్తా ఇస్రో శాస్త్రవేత్తలకు అందాలని భారతావని కోరుకుంటోంది. ఇలా  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కృష్ణ బిలాల రహస్యం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మరో అరుదైన మైలురాయి సాధించి, భారత ఘనతను గగనాన నిలిపింది.

అంతరిక్ష ప్రయోగాల వేదిక శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. రోదసి రంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. ఇప్పటికే చంద్రయాన్‌ యాత్ర చేపట్టింది. అంగారక కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టింది. ఇలా ఎన్నో విజయాలతో దూసుకుని పోతోంది. ఈ దశలో ఇస్రో పరిశోధనలకు మరింత ఆర్థిక సహకారం ఇవ్వాల్సి ఉంది. ఈ విజయం ఒక్క రోజులో సాధ్యం కాలేదు. దీని వెనుక దశాబ్దాల తరబడి నిరంత రాయంగా సాగిన శాస్త్రవేత్తల కృషి, కఠోర పట్టుదల ఉంది. అంతరిక్ష శక్తిగా ఎదగకుండా భారత్‌ను అడ్డుకోవాలన్న అంతర్జాతీయ రాజకీయాలు ఉన్నాయి. స్వావలంబన దిశలో ఇస్రో చేస్తున్న కృషికి నూతనంగా సాధించిన ఈ సామర్థ్యం ఎంతగానో ఉపయోగ పడనుంది. అన్ని ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని సాధించిన విజయం కాబట్టే ఇది చారిత్రాత్మకం. ప్రతి భారతీయుడు గర్వించదగిన విజయమిది. ఇంతటి ఘన విజయాన్ని దేశానికి అందించిన శాస్త్రవేత్తలకు అభినందించాల్సిందే. ఎన్నిసార్లు… ఎన్ని రోజులయినా మన వాడి తగ్గగదని రుజువు చేశారు. ఆర్యభట్టుడు చూపిన మార్గంలో మన అంతరిక్ష పరిశోధనలు మరింతగా ముందుకు సాగాలని గుర్తు చేసేలా ప్రయోగాలు సఫలం అవుతున్న తీరు మన వాసిని చాటుతున్నాయి.  భవిష్యత్‌ ఖగోళంలో ఇక భారత్‌ మాత్రమే చరిత్ర సృష్టించగలదని నిరూపించబోతున్నారు.
 -ప్రజాతంత్ర డెస్క్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *