నిజానికి మంచి పేరు లేదు..

నిజాలకి
అబద్దానికున్నంత మంచి పేరు లేదు….
నటనకున్నంత పలుకుబడి రాదు….
స్వార్థానికున్నంత శక్తి కూడదు

నిజాన్ని నమ్మిన మనసుది
తెలివి తక్కువే
ఉన్నదే ఉన్నట్లే
పలికే పిచ్చి ఎక్కువే.

నిజాల్ని దాచని మనసుగా
మాటల మోసం తెలియని మనిషి
నాలుక నిండారంబరం
ఓ మనిషికి లోకం దూరమే…
– చందలూరి నారాయణరావు, 9704437247

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *