Take a fresh look at your lifestyle.

నా విద లేనిపోనివి ప్రచారం చేశారు

  • పార్టీలో కొందరు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు
  • కిషన్‌ ‌రెడ్డినయినా పనిచేసుకోనీయండి
  • బిజెపి ఎంపి బండి సంజయ్‌ ‌సంచలన వ్యాఖ్యలు
  • అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశానన్న బండి
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 21 : తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌  ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పితూరీలు మోసారని మండిపడ్డారు. తన వి•ద సొంత పార్టీలోనే కొందరు హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశారని బండి చెప్పుకొచ్చారు. కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్‌ ‌రెడ్డిని అయినా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలిని చురకలు అంటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డిని  నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి వి•డియా ముందుకు పెద్దగా రాలేదు. శుక్రవారం నాడు కిషన్‌ ‌రెడ్డి బీజేపీ ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించగా..ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు దిల్లీకి తప్పుడు ఫిర్యాదులు చేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశానన్న సంతృప్తి తనకుందన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సహకరించిన కార్యకర్తలు, నేతలకు ఈ సభావేదికగా బండి ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, ‌దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌లను పరోక్షంగా కామెంట్స్ ‌చేశారు. పత్రికల్లో ఉండే వాళ్ళు ప్రజల్లో ఉండలేరని సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించారు. సోషల్‌ ‌వి•డియా, వార్తా పత్రికల్లో ఉండటం కాదు..ప్రజల్లో ఉండాలని ఒకింత హితవు పలికారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పైసలు పంచలేదని..ఆయన దగ్గర లేవన్నారు. అయితే..కొందరు నేతలు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు.
బీజేపీలో బండి కామెంట్స్ ‌చర్చనీయాంశంగా మారాయి. కిషన్‌ ‌రెడ్డి బాధ్యతలు చేపడుతున్న ఈ కార్యక్రమానికి దిల్లీ నుంచి ప్రకాశ్‌ ‌జవాడేకర్‌, ‌మురళీధర్‌ ‌రావు, తరుణ్‌ ‌చుగ్‌, ఎం‌పీలు, ఎమ్మెల్యేలు, కీలక, ముఖ్య నేతలు పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. బండి ప్రసంగం విన్న ఈ నేతలు నోరెళ్లబెట్టారు. వాస్తవానికి.. ఈ మధ్య ఈటల-బండి వర్గానికి అస్సలు పడట్లేదు. ఇరు వర్గీయులు పార్టీ ఆఫీసులోనే కొట్టుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న ఈటల ఈ సభా వేదికగా గట్టిగానే చురకలు అంటించారని బండి వర్గీయులు చెప్పుకుంటున్నారు. రాజగోపాల్‌ ‌రెడ్డి గురించి ఈ మధ్యే హైదరాబాద్‌, ‌దిల్లీ వేదికగా ఎమ్మెల్యే రఘునందన రావు కామెంట్స్ ‌చేసిన విషయం తెలిసిందే. ఇదే సభలో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి కామెంట్స్ ‌కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. బీఆర్‌ఎస్‌, ‌బీజేపి రెండు ఒక్కటి కాదని చెప్పేందుకు..కేంద్ర దర్యాప్తు సంస్థలపై రాజగోపాల్‌ ‌తీవ్ర వాఖ్యలు చేశారు.

Leave a Reply