ఆధునిక తెలుగు కవులలో గొప్ప పేరుగాంచిన విశ్వ కవి గుర్రం జాషువా.తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహాకవి గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు లో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు కులాంతర వివాహం చేసుకోవడంతో ఆ కాలంలో వాళ్ల కుటుంబాన్ని చిన్న చూపు చూసేవారు. పాఠశాలకు వెళ్లే వయసు నుండే ఉపాధ్యాయుల నుండి తోటి విద్యార్థుల నుండి ఎన్నో అవమానాలు ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. జాషువా ఊరుకునే వాడు కాదు తిరగబడే వాడు. ఆయన సాహిత్యంలో స్పృశించని అంశం లేదు. జాషువా కవితా కంఠం విలక్షణమైనది. సంఘసంస్కరణే ఆయన కావ్య లక్ష్యం. వర్గ సంఘర్షణ ఆర్థిక వ్యత్యాసాలు దోపిడీపై తిరుగుబాటు చేసిన అభ్యుదయ వాది. జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్న జాషువా వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అన్నారు కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరుగుబాటు చేశారు. ఒకసారి వినుకొండలో జరిగిన అవధాన సభలో ఆయన పద్యాలు చదువుతుండగా తక్కువ కులం వాడిని సభలోకి ఎందుకు రానిచ్చారని కొందరు హేళన చేశారు. ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నారు జాషువా చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన విలక్షణకవిజాషువా. 1910లో మేరీని వివాహం చేసుకున్నారు పది సంవత్సరాల పాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగించారు.కొంతకాలం మద్రాస్ రేడియోలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గా, ఉపాధ్యాయ శిక్షణ ఆలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.1928 నుండి 1942 వరకు గుంటూరులోని ప్రాథమిక పాఠశాలలో తెలుగు పండితుడుగా పని చేశారు.కొంతకాలం ఆంద్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు గా పనిచేశారు.
చిన్నతనం నుండే జాషువా లో సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉండేది. బాల్య స్నేహితులు రచయిత దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి సహచర్యంలో జాషువాకు కవిత్వంపై ఆసక్తి కలిగింది.హిందువులు అంటరాని వాడని ఈసడిస్తే క్రైస్తవుడై ఉండి హిందూ మత రచనలు చేస్తున్నారని క్రైస్తవ మతా మతాధిపతులు ఆయన ఈసడించారు. క్రైస్తవ మతం నుండి బహిష్కరించారు. ఎప్పుడు ఎక్కడ ఏ కులాన్ని ఏ మతాన్ని నిందిస్తూ జాషువా పద్యాలు కావ్యాలు రాయలేదు. తనకిద్దరు గురువులు ఉన్నారని అంటారు జాషువా ఒకరు పేదరికం అయితే మరొకరు కుల మత భేదం అని చెప్తాడు ఆకలి సహనాన్ని నేర్పితే కుల వివక్షత నాకు పట్టుదల నేర్పింది అంటాడు. పద్య చమత్కారాలతో కండకావ్యాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుతూ సాహితీ లోకాన నిలిచిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా.దీపాల వపిచ్చయశాస్త్రి ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు జాషువా కవిత్వానికి గట్టి పునాదులుగా నిలిచారు. తన రచనలు కండకావ్యాలు గబ్బిలం, కాందీ శీకుడు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాష్ట్ర పూజ, కొత్త లోకం, ముసాపరులు, శిశువు, నాగార్జునసాగర్, స్వప్న కథ, గిజిగాడు, స్మశాన వాటిక, సాలీడు మొదలైనవి. నేతాజీ కండకావ్యాన్ని తన తండ్రికి అంకితం ఇచ్చాడు. లఘుకావ్యాలు,పిరదౌసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర. క్రీస్తు చరిత్ర కావ్యానికి కేంద్ర సాహిత్యకాడమీ అవార్డు లభించింది.
గద్యకావ్యాలు, కుశలవోపాఖ్యానం,చిన్న నాయకుడు, చంద్రిక (అలభ్యం).
దృశ్య రూపక నాటకాలులిలిసత్య హరిచంద్ర రుక్మిణి కళ్యాణం, శివానంద ప్రభాతం, ధ్రువ విజయం, వీరబాబు, దావీదు చరిత్ర (అలభ్యం) పద్య కావ్యాలు, హిమదామర్కధర పరిణయం, శివాజీ ప్రబంధం, కన్యకా పరమేశ్వరి మొధలైనవి. జాషువా రచనల్లో గబ్బిలం సర్వోన్నతమైంది కాళిదాసు మేఘసందేశాన్ని పోలి ఉంటుంది. అయితే ఇక్కడ సందేశం పంపేది మాత్రం ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు ఆకలితో కడుపు కాలుతున్న అరుంధతి సుతుడు. తన గోడును కాశీ విశ్వనాధునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపిస్తాడు. కథానాయకుని వేదనను వర్ణించిన తీరు పాఠకుల హృదయాలను కలచివేస్తుంది. అట్టడుగున ఉన్న జాతులకు ఆ కాలంలో దేవాలయాలలో ప్రవేశం లేదు. దాన్ని నిరసిస్తూ దేవుడికి కబురును గబ్బిలంతో పంపిస్తాడు లినిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కూల్చివేయును అంటాడులిలిపాముకు పాలు పోస్తాం, చీమకు చక్కర పెడతాం, దళితున్ని చూస్తే మాత్రం ఆ దేవత కూడా ఉలిక్కి పడుతుం దంటాడు. వాని చెమట కష్టం లేని నాడు సస్య రమ పండి పులకింప శయించులిలికష్టపడి ప్రపంచానికి భోజనం పెట్టే వాడికి భుక్తిలేదని ఆవేదనను వెలిబుచ్చుతాడు.లికులమతాలు గీసుకున్న గీతలజొచ్చి పంజరాన కట్టుబడను నేనులిలిఅంటూ కూలమత అంతరాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశాడు జాషువా. అందుకే విశ్వ నరుడ నేను అంటాడు.
పిరదౌసి పర్షియన్ చక్రవర్తి అయినా గజినీ మహమ్మద్ ఆస్థాన కవి పిరదౌసి. తన చరిత్రను రాస్తే మాటకొక బంగారు నాణెం ఇస్తాననీ రాజుచెప్పగా, కవి పది సంవత్సరాలు శ్రమించి రాజు పై మహాకావ్యం రాసాడు. ఇచ్చిన మాటను తప్పిన రాజు… ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న పిరదోసి కవిని అద్భుతంగా వర్ణించాడు జాషువా. సత్య హరిచంద్ర నాటకంలో ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలం నిప్పులో కరిగిపోయెను అంటూ స్మశానం లో కుల మత భేదాలు లేవంటూ రాజైనా, బంటైనా మరణం అందరికీ సమానమేనని తేల్చి చెప్పాడు.‘స్వప్న కథ’ కావ్యం ద్వారా మాతృ ప్రేమను ఒక వృద్ధురాలి కథ ద్వారా వేదనాభరితంగా వర్ణించారు. గాంధీజీ మరణాన్ని విని ఆవేదనతో బాపూజీ అంటూ తనకు నీరాజనాల అర్పించాడు. క్రీస్తు కథ ముంతాజ్ మహల్ వంటి గ్రంథాల ద్వారా తన నాడిని స్పష్టంగా వినిపించి సామాజిక స్పృహము కలిగించిన అభ్యుదయ కవి గుర్రం జాషువా.
నా కవితా వధూటి వదనంబును ఎగాదిగా చూసి భళీలి అన్న వాళ్లు నా కులాన్ని చూసి నన్ను దూషించారని ఆవేదన చెందాడు.శిశువు కావ్యం ద్వారా తన రాచరికాన్ని. అక్షయమైన మాతృ క్షీర మధుదారులు అన్నముగా తెచ్చుకున్న అతిధి అంటూ చక్కగా వర్ణించారు. వీరి సాహిత్య పటిమతో అనేక సన్మానాలు బిరుదులు పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ తో,భారత ప్రభుత్వం పద్మ విభూషణ్, విక్రమ దేవ వర్మ కవితా విశారద, వినుకొండ వల్లపరాయుడు కవికోకిల, తిరుపతి కవితా సమితి వారు మధుర శ్రీనాథ, ఏలూరు తెలుగు దర్బార్ సంస్థ వారు విశ్వకవి సామ్రాట్ అని ఇంకా ఎన్నో సత్కారాలను అందుకున్న సుఖవిశేకరుడు గుర్రం జాషువా. చెల్ల పిల్ల వెంకట శాస్త్రి గారు స్వయంగా గండపెండెరం తొడిగి కవిదిగ్గజ, నవయుగ కావి చక్రవర్తి అని కొని ఆడారు.
అభ్యుదయ భావాలు గల సంప్రదాయకవి.వీరి కవిత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన జీవితమే తనకు కథా వస్తువు. వేదనాభరిత జీవితా అనుభవంతో మానవ జీవితాన్ని వ్యాఖ్యానించిన కవి. తన కవిత్వంలో జీవ లక్షణాలు, నిజాయితీ, ఆర్తి,ఆవేశం,ప్రతిఘటన కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. వీరు 1971 జూలై 24న గుంటూరులో పరమపదించారు జాషువా కవిత్వాన్ని అతని వ్యక్తిత్వం నుండి విడదీసి చూడలేము సినారె.





