నల్ల చట్టాలు మీవి.. సంక్షేమ పథకాలు మావి

  • కోడిగుడ్డుపై ఈకలు పీకే తీరు బీజేపీది
  • ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
  • కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా మాటలు హేయం
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు
  • ఉచితం వొద్దట…కేంద్రం తీరుపై హరీష్‌ ఆ‌గ్రహం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టేలా ఉన్నదని, నల్ల చట్టాలు అమలు చేసిన ప్రభుత్వం వారిది…రైతు, ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా చూస్తున్న కేంద్ర బీజేపీ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ..ఉపాధి హామీ పథకం డబ్బులు మంజూరు చేయడంలో కేంద్రం వైఫల్యం చెందిందని, అనేక ఆంక్షలు పెట్టి రూ.1.12 కోట్ల ఉపాధి కూలీలకు ఇబ్బందులు చేసే విధంగా కేంద్రం కొత్త జిఓ తెచ్చిందని ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి బడా బడా వ్యాపారులపైన ఉన్న ప్రేమ ఉపాధి హామీ పథకం కూలీల మీద లేదని, ఉపాధి హామీలో 10 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, ఇది సాక్షాత్తు కేంద్ర మంత్రి చెప్పిన మాట అంటూ మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు.

దేశ వ్యాప్తంగా ఇవాళ వేలాది కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కేంద్రం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఉపాధి హామీ పథకంలో 20 రకాల పనులు మాత్రమే చేయాలని, మట్టి పనులు వద్దని, అనేక ఆంక్షలు పెట్టిందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్న చిన్న తప్పులు చూపుతూ కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని, ఈజీఎస్‌ ‌పట్ల కేంద్రం మొండిగా ఉందన్నారు. రైతు వేదిక, వడ్ల కొనుగోలు కోసం కట్టిన ధాన్యం కల్లాలను గురించి తప్పులుగా చూపే ప్రయత్నాలు చేస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు లేవన్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేసిన అమిత్‌ ‌షా మాటలు విడ్డూరంగా ఉన్నాయని., రైతు పంట కొనడంలో కొర్రీలు పెట్టి కేంద్రం బాధ్యత నుంచి తప్పుకుందని, అయినప్పటికీ రైతులు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్‌ ‌ధాన్యం మొత్తం కొన్నారని., రైతుకు ఎరువులు, బీమా, రైతుబంధు ఇవ్వడంతో పాటు కొనుగోలు చేసేలా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

ఉచితం వొద్దట… కేంద్రం తీరుపై హరీష్‌ ఆ‌గ్రహం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ చెబుతున్నదని, ఉచితాలు రద్దు కాదు బీజేపీ పార్టీని మనం రద్దు చేయాలని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో 218 మందికి బీడీ పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. బీడీ కార్మికుల గురించి ఆలోచించిన నాయకుడు ఒక్క సీఎం కేసీఆర్‌ ‌మాత్రమేనని, తెలంగాణలో 4 లక్షల మందికి బీడీ పింఛన్లు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎవ్వరికీ బీడీ పింఛన్‌ ‌లేదన్నారు. బీడీ పరిశ్రమ మీద కూడా కేంద్రం ఆంక్షలు విధించింది.

దీంతో పని దొరకని పరిస్థితి నెలకొన్నదని వివరించి 28 శాతం జిఎస్టీ విధించారని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ పల్లెల్లో ఇది ఒక పెద్ద ఉపాధి అని అయినా.. కేంద్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీడీ కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు తొలగించి, కష్టం చేసుకునే బీడీ పరిశ్రమ మీద కేంద్రం కక్ష్య కట్టిందని ఆరోపించారు. అన్ని వర్గాలను అనేక ఇబ్బందులు పెట్టిందని, వాస్తవాలు గ్రహించాలని ఆయన ప్రజలను కోరారు. బీడీ ఆసరా ఉచితం వద్దు అని కేంద్రం చెబుతుందని, ఉచితాలు బంద్‌ ‌చేయాలని బీజేపీ చెబుతుందని అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేద్దామని, కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి అండగా ఉందామని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *