370 సీట్ల లక్ష్యం కోసం విపక్షాలకు బీజేపీ బెదిరింపులు
రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర
జైపూర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ విమర్శ
రైతులు, పేదల గోడు వినే నాథుడే లేడని ఆవేదన
జైపూర్, ఏప్రిల్ 6 : దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడుస్తు న్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీలో చేరాల్సిందిగా విపక్ష నేతలను బెదిరిసు ్తన్నారని ఆక్షేపించారు. దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశం గట్టి గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపుని చ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సోనియాగాంధీ మాట్లాడుతూ.. తనను తాను ఒక గొప్పవ్యక్తిగా మోదీ భావించుకుంటూ దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. బీజేపీలో చేరాలని విపక్ష నేతలను బెదిరిస్తున్నారని, ఈరోజు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిరదని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఇదంతా నియంతృత్వమేనని, దానికి ప్రజలంతా కలిసికట్టుగా గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ..ఈసారి జరిగేవి ఎంతో నిర్ణయాత్మక ఎన్నికలని అన్నారు. రెండు సిద్దాంతాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. రాజ్యాంగాన్ని బలహీనపరచడమే కేంద్ర ప్రభుత్వ విధానమని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని తొలిసారిగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రకటించారని, ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవని అన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్, జార?ండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌లను ఈడీ అరెస్టు చేయడాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రస్తావిస్తూ..కేంద్రంలోని బీజేపీ హయాంలో విపక్షాలు దాడులకు గురవుతున్నా యని ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలోనూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకున్నాయని, రైతులు, పేదల గోడు వినే నాథుడే లేడని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోకు ‘న్యాయ్ పాత్ర‘ అనే పేరు పెట్టిందని, ఇది ఎన్నికల తర్వాత మరిచిపోయే ప్రకటనల జాబితా ఎంతమాత్రం కాదని, న్యాయం కావాలని కోరుకుంటున్న దేశప్రజల వాణి అని అన్నారు.





