దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ మోతినగర్ లో ఆర్టిఫిషయల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో దివ్యాగులకు కిషన్ రెడ్డి కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచామన్నారు.
ప్రతి విషయంలో దివ్యాంగులకు కేంద్రసర్కార్ అండగా ఉంటోందని చెప్పారు. దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి, బస్సు, రైలు పాస్‌లు, ఇతర రాయితీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. దివ్యాంగులను ఎవరైనా హింసిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




