దిల్లీ లిక్కర్‌ కేసులో దక్కని ఊరట

  • కవిత బెయిల్‌ జూలై 9 వరకు పొడిగింపు
  • కేజ్రీవాల్‌ బెయిల్‌పై హైకోర్టు స్టే..తీర్పు రిజర్వ్‌

న్యూ దిల్లీ జూన్‌21 : దిల్లీ లిక్కర్‌ కేసులో కవితకు ఊరట దక్కడం లేదు. ఆమె బెయిల్‌ను కోర్టు తిరస్కరించడమే గాకుండా జులై9 వరకు కస్టడీని పొడిగించింది. ఇక ది ల్లీ సిఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసినా, ఇడి వాల్‌ చేయడంతో వ్యవహారం హైకోర్టుకు చేరింది. కిందికోర్టు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఇద్దరికీ బెయిల్‌ కష్టాలు ప్పడం లేదు. ఈ క్రమంలో సీబీఐ ప్రత్యేక కోర్టులో బీఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవితకు ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్‌ పాలసీ పై సీబీఐ దాఖలు చేసిన కేసులో కవితకు జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగించారు. కవిత జ్యుడిషియల్‌ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. జులై 7వరకు కస్టడీ పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం  కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆమె జ్యుడిషియల్‌ కస్టడీలోభాగంగా న్యూఢల్లీిలోని తీహార్‌ జైల్లో ఉన్నారు. బెయిల్‌ కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. ఆ తర్వాత ఇదే కేసులో ఆమెను సీబీఐ సైతం విచారించి అరెస్టు చూపించింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది కానీ.. దిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది.

 

కవిత బెయిల్‌ కోసం ఆమె తరపు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  కనీసం మధ్యంతర బెయిల్‌ కూడా దక్కలేదు. బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయ విభాగం కూడా శ్రమిస్తోంది. ఇటీవల కవిత కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ.. ఆమెకు బెయిల్‌ లభించలేదు. తనను అక్రమంగా అరెస్టు చేశారని.. ఇది మనీలాండరింగ్‌ కేసు కాదని, పొలిటికల్‌ లాండరింగ్‌ కేసని అప్పట్లో కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్‌ వ్నిడియాలో వైరలయ్యాయి. ఇప్పుడు ఆమె కస్టడీని కూడా కోర్టు పొడిగిస్తూ వస్తోంది. ఈ కేసులో కవితే ప్రధాన నిందితురాలని, ఆమెకు బెయిల్‌ వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదిస్తూ వస్తోంది. కాగా.. ఈమేరకు ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. కాగా.. ఈ కేసులో 100 కోట్ల ముడుపులు చేతులు మారాయని.. అందులో కీలక సూత్రధారి, పాత్రధారి కవితేనంటూ ఈడీ, సీబీఐ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చార్జిషీట్లలోనూ ఇదే విషయం చెప్పారు. దిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టు అయిన వారు సుదీర్ఘ కాలంగా జైల్లో ఉంటున్నారు. దిల్లీ డిప్యూటీ సీఎం మనష్‌ సిసోడియా అరెస్ట్‌ అయి ఏడాది దాటిపోయింది. కేజీవ్రాల్‌కు బెయిల్‌ లభించడం లేదు. ఆయన సీఎం పదవికి కూడా రాజీనామా చేయడం లేదు. అప్రూవర్లుగా మారిన ఇతర నిందితులు మాత్రం బెయిల్‌ తెచ్చుకున్నారు. ఇకపోతే దిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌కు గురువారం దిల్లీ కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. మరికొన్ని గంటల్లో తీహార్‌ జైలు నుంచి విడుదలవుతారన్న సమయంలో హైకోర్టు రూపంలో మరో షాక్‌ తగిలింది. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.

అత్యవసరంగా విచారించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీంతో దిల్లీ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ పరిణామంతో ఆప్‌ షాక్‌కు గురైంది.ఇక తీర్పును రిజర్వ్‌ చేసే వరకు కేజీవ్రాల్‌ను జైలు నుంచి బయటకు వొచ్చేందుకు అనుమతించాలని కేజీవ్రాల్‌ తరపున హైకోర్టును కోరారు. కానీ కేజీవ్రాల్‌ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. మొత్తం రికార్డులను పరిశీలించాలని కోరుతున్నందున 2-3 రోజుల పాటు ఉత్తర్వులను రిజర్వ్‌ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో తుదితీర్పు వొచ్చే వరకు కేజీవ్రాల్‌ తీహార్‌ జైల్లోనే ఉండనున్నారు. ఇదిలా ఉంటే ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్‌ చేసిన ఈడీ.. మద్యం పాలసీ కేసులో కేజీవ్రాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని వాదించింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న దిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. లిక్కర్‌ పాలసీ కేసులో మార్చి 21న కేజీవ్రాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం తీహార్‌ జైలుకు తరలించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు.. 21 రోజులు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం జూన్‌ 2న తిరిగి తీహార్‌ జైల్లో లొంగిపోయారు. మొత్తానికి ఇంత కాలానికి గురువారం దిల్లీ కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తే.. కొన్ని గంటల వ్యవధిలోనే హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *