మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ధర్నా చౌక్‌లో విద్యార్థుల ధర్నాపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ…త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు ప్రకటిస్తామని హావ్ని ఇచ్చారు. ఉద్యోగాల ఖాలీలను గుర్తించి అతి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చారు. కొందరు విద్యార్థులు, నిరుద్యోగ మిత్రులు ఈరోజు ధర్నా చేస్తున్నారని, అయితే ఉద్యోగాల భర్తీ విషయంలో లీగల్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నిపుణులతో చర్చిస్తున్నామని అన్నారు. జీవో 46 బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు మరోసారి హావ్ని ఇచ్చారు.




