అమ్మ నేర్పిన భాష
అమ్మలా విలువైన భాష,
మనసుమెచ్చే భాష
భావి బాటకు మూలధనమైనదే
అమ్మ భాష.
మంచి గంధం,మల్లెపూవులా
పరిమళాలు పంచుతూ,
బండరాళ్లకు ప్రాణం పోసిన శిల్పిలా
మూర్తిమత్వాన్ని పెంపొందింపచేసేదే
ఉగ్గుపాల భాష.
మమతలు నింపే
విలువలు పెంచే
సాంస్కృతిక వారసత్వజ్యోతైన
మాతృభాషలో,
ప్రతీ పలుకు మాధుర్యం
ఆలోచనలు అమృతం.
సృష్టిలో ఎన్ని ప్రేమలు లభించినా
అమ్మ ప్రేమను మించలేవు.
బ్రతుకు తెరువుకోసం
ఎన్ని భాషలు నేర్చినా,
మాతృభాషలోని మార్దవం
ఇసుమంతైనా వాటిలో లభించదు.
అందుకే…
వ్యక్తి వికాసానికి
అమ్మ భాష తొలిమెట్టని గుర్తెరిగి,
మాట నేర్పిన భాషను
అందరూ మెచ్చేట్టుగా పలుకుదాం.
మాతృభాషలోని తియ్యదనం
ఆస్వాదిద్దాం మనసారా…
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం




