మండలి పురస్కారాల ప్రదానోత్సవంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 26 : తెలుగు బాష తల్లిపాల లాంటిందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు సాంస్కృతిక పురస్కారాల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలి వెంకట కృష్ణారావు అవార్డు సిఎంకె రెడ్డికి అందజేయడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు బాష కోసం సిఎంకె రెడ్డి చాలా కృషి చేశారని చెప్పారు. ఈ అవార్డుకి ఆయన సరైన వ్యక్తి అని కొనియాడారు. మండలి వెంకట కృష్ణారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన గాంధీయ మార్గాన్ని అనుసరించారని తమిళిసై తెలిపారు. 1977 తుఫాన్ సమయంలో ఆయన సేవలు మరువలేనివని ఆమె గుర్తుచేశారు. ఇక చెన్నైలో తెలుగు మాట్లాడే వారు ఎక్కువని అన్నారు. వి•రందరు తెలుగు నమ్మినవారు…అందుకే తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానని తమిళిసై వెల్లడించారు.
తాను తెలంగాణ ఆడపడుచునని, తమిళనాడు కోడలినని తమిళిసై స్పష్టం చేశారు. చెన్నై నుంచి పిలిపించి వెంకట కృష్ణారావు అవార్డును తనకు అందిచడం ఆనందంగా ఉందని సిఎంకె రెడ్డి అన్నారు. పొట్టి శ్రీరాములు జిల్లా వాసుడై..పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో మండలి వెంకట కృష్ణారావు పూరస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. భాష లేకపోతే జాతి లేదని, మాతృభాషను రక్షించుకోవడం మన అందరిపై ఉందని వెల్లడించారు. చదువు ఒక్కటే కాదు..కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఎక్స్‌ట్రా ఆక్టివిటీస్‌ను ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో లక్ష మంది ఆత్మహత్యలు చేసుకుంటే..అందులో 8 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారందరూ ప్రెషర్ వల్ల చనిపోతున్నారని చెప్పుకొచ్చారు. చదువు ఒక్కటే కాకుండా వారికీ నచ్చిన ప్రొఫెషన్‌లలో వెళ్లేలా ప్రోత్సహించాలని చెప్పారు. మంచి ఆహారం, వ్యాయామం, ఎక్సర్‌సైజ్ మనసును తేలికగా ఉంచుతుందని, తద్వారా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు..అవనిగడ్డలో ఉన్న సంస్థకు వొచ్చిన నగదును తాను విరాళంగా అందిస్తానని తెలిపారు.




