38వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : తెలంగాణ బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చిట్యాల ఐలమ్మ ప్రతీక అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నేడు ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా సాయుధ తెలంగాణ పోరాట కాలం లో వారు కనబరిచిన ధైర్య సాహసాలను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వివక్షను ఎదురిస్తూ సాగిన నాటి వారి పోరాట స్పూర్తి, తెలంగాణ సాధన ఉద్యమంలో ఇమిడి వున్నదని సిఎం తెలిపారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ , తెలంగాణ పోరాట యోధులను సమున్నత రీతిలో స్మరించుకుంటున్నదని తెలిపారు. సబ్బండ కులాలు, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతంగా నిలిచాయని సిఎం తెలిపారు.




