తెలంగాణలో వ్యూహకర్త పికె గేమ్‌ ‌ప్లాన్‌

  • ‌టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నాయి
  • కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేయట్లేదు?
  • టిపిసిపి చీఫ్‌ ‌రేవంత్‌ ఆరోపణలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిషోర్‌(‌పీకే) పన్నిన వ్యూహంలో భాగంగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు ప్రయత్నిస్తున్నాయని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చడం ద్వారా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌కు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ మధ్య అవగాహన ఉందని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి అన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ మధ్యే ప్రధాన పోటీ అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఉనికిలో కూడా లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 8 ఏళ్ల పాలనలో తెలంగాణకు కేసీఆర్‌ ‌చేసిందే లేదన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌మధ్య రాజకీయ వైరుధ్యమున్నట్లు నమ్మిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చాక వేల కోట్లు కొల్లగొట్టిందని ఆరోపించారు. కేసీఆర్‌ ఓ ఆర్థిక ఉగ్రవాదని విమర్శించారు. కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ చేయట్లేదు? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని బలపర్చేలా మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌మధ్య ఎలాంటి రాజకీయ వైరుధ్యాలు లేవన్నారు. కాంగ్రెస్‌ను బలహీన పర్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌ ‌లో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ (‌టీఎంసీ) గెలవడానికి ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌వ్యూహమే కారణమన్నారు.

విపక్షాలను బలహీన పర్చే విధంగా మమతా బెనర్జీ గెలవడానికి బీజేపీకి ప్రతిపక్ష •దా రావడానికి ఇద్దరి మధ్య చక్రం తిప్పింది పీకేనే అన్నారు. తెలంగాణలో కూడా కేసీఆర్‌, ‌మోడీల మధ్య పీకే ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ‌రద్దయితే పీడ విరగడవుతుందని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. నిన్న కేటీఆర్‌ ‌వ్యాఖ్యలు కూడా మోడీకి అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని.. విభేదాలు మాత్రం లేవన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌రద్దయ్యే వరకు కాంగ్రెస్‌ ‌పోరాటం చేస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *