Take a fresh look at your lifestyle.

తెలంగాణలో పాదయాత్ర కాదు..ఎపిలో ఓదార్పు యాత్ర చేయాలి

ఏ ఎంబసీలో షర్మిల వీసా తీసుకుని షర్మిల వొచ్చారు
తండ్రి లాగానే విషపు నవ్వుతో బయలుదేరారు
విభజన సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదు
తెలంగాణ అభివృద్ధ్దిపై విషప్రచారాలు చేస్తున్న షర్మిల
షర్మిల వెనక ఉన్నదెవరో త్వరలోనే బయట పెడతాం
తెలంగాణను దోచుకునే కుట్రలో భాగంగానే పాదయాత్ర
డియా సమావేశంలో ఘాటు విమర్శలు చేసి గొంగిడి
సునీత,మాలోత్‌ ‌కవిత

తెలంగాణలో విషపు నాగులు తిరుగు తున్నాయని టిఆర్‌ఎస్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. షర్మిల వెనుక ఎవరున్నారో త్వరలో బయటపడు తుందన్నారు. ఏపీలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో.. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎందుకు ఎదురు చూస్తున్నారో షర్మిల అన్న ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డిని అడిగితే సమాధానం చెబుతారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి లాగానే షర్మిల విషపునవ్వు నవ్వుతూ తెలంగాణలో తిరుగుతున్నారని గొంగిడి సునీత ఆరోపించారు. ఆమె నాన్న పేరు చెప్పుకుని తిరగడం తప్ప షర్మిలకు ఐడెంటిటీ ఏముందని ప్రశ్నించారు. ఎంపీ మాలోత్‌ ‌కవితతో కలిసి టీఆర్‌ఎస్‌ ఎల్పీలో బుధవారం డియాతో మాట్లాడారు. తెలంగాణలో విష నాగులు తిరుగుతున్నాయని, షర్మిల ప్రస్థానం ఎటు వైపు అని, ఏ లక్ష్యంతో పాదయాత్ర చేస్తుందని నిలదీశారు. తెలంగాణ వ్యతిరేక భావాన్ని షర్మిల కొనసాగిస్తుందని ఆరోపించారు. ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు షర్మిలను గౌరవించారని, ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.

2004లోనే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను షర్మిల తండ్రి.. వైఎస్సార్‌ ‌కొనుగోలు చేశారని మండిపడ్డారు. ప్రజల కోసం చేస్తున్న పాదయాత్ర అయితే.. విభజన సమస్యల గురించి ఒక్కసారి అయినా కేంద్రాన్ని అడిగారా అని నిలదీశారు. షర్మిలకు తెలంగాణ ప్రజల కష్టాలు, గిరిజన బిడ్డల తంటాలు తెలుసాఅని ప్రశ్నించారు. షర్మిల ఏ ఎంబసీలో వీసా తీసుకొని తెలంగాణ కు వచ్చారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ అభివృద్ధి పై ఓర్వలేక టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని గొంగిడి సునీత తెలిపారు. ఇప్పుడు ఏపీలో ఓదార్పు అవసరమని..అక్కడకు వెళ్లి పాదయాత్ర చేసుకోవాలని సూచించారు. యాత్ర పేరుతో ఇక్కడ అసత్యాలు, అబద్దాలు ఆడితే తెలంగాణ ప్రజలు సహించరని పేర్కొన్నారు. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను విని తట్టుకోలేకనే పాదయాత్రను టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. తెలంగాణ ఆఫ్ఘనిస్తాన్‌ అయితే.. ఇక్కడ షర్మిల ఎందుకు ఉంటున్నారని ప్రభుత్వ విప్‌ ‌గొంగిడి సునీత ప్రశ్నించారు. ఏపీలో రైతుల మోటార్లకు టర్లు పెడుతున్నారని, దీనిపై షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదని, అక్కడి సమస్యలపై స్పందించాలని డిమాండ్‌ ‌చేశారు.

షర్మిల వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో త్వరలోనే బయటపెడుతామన్నారు. తండ్రిలాగే అధికారం వస్తుందని షర్మిల పాదయాత్ర చేపట్టిందని, నాటి ఆంధ్రా పాలకుల వైఖరిని తెలంగాణలో అనుసరిస్తున్నారని విమర్శించారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటుందని, దేశంలో అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కుట్రలు చేస్తూ తెలంగాణను ఆగం చేయాలని షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హాలు నెరవేర్చ లేదని, దీనిపై స్పందించారా? అని నిలదీశారు. బయ్యారం ఉక్కు ఫ్యాకరీ, రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీపై షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైఎస్‌ ‌జగన్‌, ‌కేవీపీ ఇద్దరు తెలంగాణ వద్దని పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకున్నారని, తెలంగాణ అభివృద్ధి షర్మిలకు ఇష్టం లేదన్నారు. ఇప్పుడు ఓదార్పు యాత్రలు ఏపీకి అవసరమని, అక్కడ పాదయాత్ర చేపట్టాలని సూచించారు. తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ‌పార్టీదన్నారు. షర్మిలను అడ్డుకున్నది మహిళలే అని గుర్తించాలని, పాదయాత్రకు అడ్డు చెప్పలదేన్నారు. తెలంగాణలో విషపు బీజాలు నాటడానికి షర్మిల ప్రయత్నం చేస్తున్నారని, ఆమె ఆటలు సాగవన్నారు. తెలంగాణలో అధికారం కోసం షర్మిల కుట్రలు చేస్తున్నారని, తెలంగాణ సమాజం గురించి తెలుసుకుని షర్మిల వ్యవహరించాలని సూచించారు. పోలీసులను ఆర్‌ఎస్‌ఎస్‌తో పోల్చారని, ఆ విధానం షర్మిలకు తెలుసని, తమకు తెలియదన్నారు. టీఆర్‌ఎస్‌పై మానసిక దాడి చేస్తున్నారని, దీన్ని చూస్తూ ఎలా ఉండాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక ముందు ఒక లెక్క అని..షర్మిల ఆటలు తెలంగాణాలో సాగవు అన్నారు. షర్మిల వ్యవహార శైలితో సెటిలర్ల విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. కోలాటం ఆడటం తెలుసు.. బతుకమ్మ ఆడటం తెలుసు.. నకరాలు కొడితే ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలుసన్నారు. ఐటీ దాడులు చేపిస్తున్న వాళ్ళు, సీబీఐ దాడులు చేయిస్తున్న వాళ్ళే షర్మిల వెనక వున్న విషపు నాగులు అని గొంగిడి సునీత ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలను ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడితే తాము చేతులు కట్టుకుని కూర్చోవాలా అని ప్రశ్నించారు.

విషం చిమ్మడమే షర్మిల లక్ష్యం ..:ఎంపీ మాలోతు కవిత
టీఆర్‌ఎస్‌ ‌పై విషం చిమ్మేందుకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఎంపీ మాలోతు కవిత ఆరోపించారు. మొన్నటి ఎలక్షన్‌ ‌లో షర్మిల ఆంధ్రాలోనే ఓటు వేశారని చెప్పారు. ఆమె ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేసినా ఓపికతో భరిస్తూ కార్యాకర్తలు సంయమనం పాటించారని…రేపటి నుంచి తాము కార్యకర్తలను ఆపలేమన్నారు. షర్మిల పద్దతి మార్చుకోవాలని.. ఏం జరిగినా మేము బాధ్యులము కాదన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన షర్మిల సీఎం కేసీఆర్‌ ‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణలో షర్మిల పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరని ఎంపీ మాలోత్‌ ‌కవిత అన్నారు.

కేసీఆర్‌ ‌కుటుంబం, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై విషం చిమ్మడమే షర్మిల లక్ష్యమని ఆరోపించారు. జగన్‌ ‌కు తెలంగాణకు ఏం సంబంధమని, ఎవరి రాష్ట్రం వాళ్లదేనన్నారు. పక్క రాష్ట్ర సీఎంగా గౌరవిస్తామన్నారు. బయ్యారం గనులను దోచుకున్నది షర్మిల కుటుంబమేనని, తెలంగాణను దోచుకోవ డానికే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రాలో పప్పులు ఉడకట్లేదనే తెలంగాణలో షర్మిల డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. షర్మిల తన మాటలు అదుపులో ఉంచుకోక పోతే టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలను ఆపడం మా వల్ల కాదని, తెలంగాణలో ప్రజా సమస్యల గురించి మాట్లాడ కుండా కేవలం వ్యక్తిగత విమర్శలు చేస్తూ దిగజారుతున్నారన్నారు. తెలంగాణకు రావాల్సిన విభజన చట్టం హాల గురించి షర్మిల ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణ రాజకీయాల గురించి షర్మిల మాట్లాడటం విడ్డూరంగా ఉందని, తెలంగాణలో షర్మిలకు కేఏ పాల్‌ ‌కన్నా తక్కువ ఓట్లు వస్తాయన్నారు. షర్మిల కుటుంబం మొత్తం తెలంగాణ వ్యతిరేక కుటుంబం మానుకోట ఘటనలో జగన్‌ను వంగపల్లి దాటనివ్వలేదన్నారు. షర్మిలపై సంస్కారంతోనే ఉన్నామని, కానీ షర్మిల మాట్లాడే పద్ధతి మాత్రం బాగోలేదన్నారు.

Leave a Reply