Take a fresh look at your lifestyle.

తెలంగాణలో అధికారమే లక్ష్యం

  • టార్గెట్‌ 60 ‌డేస్‌తో ముందుకు వెళ్లండి
  • ప్రతి ఇంటికి కమలం గుర్తు చేరాల్సిందే
  • పార్టీ నేతలకు సునీల్‌ ‌బన్సల్‌ ‌దిశానిర్దేశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : రాష్ట్ర బీజేపీ నేతలకు ఆ పార్టీ అధిష్టానం ‘టార్గెట్‌ 60 ‌డేస్‌’ ‌విధించింది. రాష్ట్ర బీజేపీ వివిధస్థాయి నేతలకు ఆ పార్టీ నేత సునీల్‌ ‌బన్సల్‌ ‌టాస్క్ ‌పెట్టారు. 60 రోజుల్లో 9 వేల కార్నర్‌ ‌వి•టింగ్‌లు పెట్టాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీ విజయాలు సహా.. సీఎం కేసీఆర్‌ ‌వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చారు. ప్రతి ఇంటికి ‘కమలం గుర్తు’ వెళ్లాలని నేతలకు బన్సల్‌ ‌సూచించారు. తెలంగాణలో కూడా బీజేపీనే అధికారంలోకి వొస్తుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నేతలు అందరూ ప్రజల్లోనే ఉండాలని సూచించారు. పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతి ఇంటికి కమలం గుర్తు వెళ్లాలన్నారు.

నేటి నుంచే గ్రౌండ్‌ ‌వర్క్ ‌ప్రారంభించాలని జాయింట్‌ ‌కన్వీనర్లు, ప్రభారీలు, విస్తారక్‌ల సమావేశంలో సునీల్‌ ‌బన్సల్‌ ‌దిశానిర్దేశం చేశారు. వొచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. గురువారం నుంచే గ్రౌండ్‌ ‌వర్క్ ‌ప్రారంభించాలని, ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేశామని బన్సల్‌ ‌తెలిపారు. మిషన్‌ 90  ‌లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కట్టనున్నారు. జనవరి 16వ తేదీ నుంచి బండి సంజయ్‌, ‌బీజేపీ సీనియర్‌ ‌నేతలు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేయనున్నారు. జనవరిలో గ్రామల్లో పది వేల గ్రామ సభలకు కమలం పార్టీ ప్లాన్‌ ‌చేసింది.

ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రానున్నారు. ఏడు లక్షల మంది బూత్‌ ‌కమిటీ సభ్యులతో సమ్మేళనం కానున్నారు. అలాగే ఏప్రిల్‌లో కేంద్రమంత్రి అమిత్‌ ‌షా  హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై ఛార్జ్ ‌షీట్‌ ‌విడుదల చేయనున్నారు. కాగా బండి సంజయ్‌ ‌బస్సు యాత్రలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కార్నర్‌ ‌వి•టింగ్‌లకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు యాత్రలో కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్నారు.

Leave a Reply