తిరుమలలో కొనసాగుతున్నరద్దీ

తిరుమల, అక్టోబర్‌ 8 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది .పెరటాసి మాసం, మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, ‌నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు గోగర్భం డ్యామ్‌ ‌వద్దకు చేరుకున్నాయి. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమల కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

కంపార్టుమెంట్లన్నీ నిండి గోగర్భం జలాశయం వరకు భక్తులు వేచిఉన్నారు. రాత్రి 10 గంటల తరువాత క్యూలైన్లోకి భక్తులు వెళ్లకుండా సిబ్బంది నిలిపివేశారు. ఉదయం 7 గంటల నుంచి క్యూలైన్లోలోకి అనమతిస్తున్నారు. నిన్న స్వామివారిని 70,007 మంది భక్తులు దర్శించుకోగా 42,866 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.25 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *