తస్మాత్‌ జాగ్రత్త..!

ఎన్నికలొచ్చాయంటే…
నాయక గణం
రంగురంగుల జెండాలతో
హోరెత్తెంచే ప్రచారాలతో
రకరకాల వాగ్దానాలు, హామీలు గుప్పిస్తూ
ప్రత్యక్షమై పోతుంటారు!
ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమంటూ
కల్లబొల్లి మాటలు చెబుతూ
విచిత్ర ఆహార్యాలతో
ఊకదంపుడు ఉపన్యాసాలిస్తూ
కుటిల పన్నాగాలు పన్నుతూ
జనాన్ని ఉచితహామీల ఎత్తుగడలతో
ఆశల సుడిగుండాల్లో దించి
ఓట్లు దండుకొనే
ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తుంటారు!!

నేడు
విలువలు విలుప్తమై
రాజకీయ నైతికత మేడిపండు చందమై
ఎన్నికల నిబంధనలు కొరగానివై
అకృత్యాల వికృత రాజకీయ పాలనల్లో
చట్టసభల ప్రతిష్టలు నేలమట్టమై
వ్యవస్థలన్నీ నిర్వీర్యమై
సంక్షేమం మృగ్యమై
ప్రజాస్వామ్యమే పెను సంక్షోభంలో పడుతోంది..!

అందుకే..ఓటరు మహాశయా..
తస్మాత్‌ జాగ్రత్త..!
తెలుసుకో..
చైతన్యమే నీ పురోగమనం
ఓటే నీ వజ్రాయుధం
కర్తవ్యశూరుడివై, కార్యోన్ముఖిడివై
దుష్ట రాజకీయాలను దునిమి
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించు..

-పి.వి.ప్రసాద్‌
9440176824

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *