‘సుప్రీం’ తీర్పును తుంగలో తొక్కిన కేంద్రం
కేజ్రీవాల్‌ను ఎదుర్కోలేక గవర్నర్లతో పెత్తనం
ఆర్డినెన్స్ ఉపసంహరించే వరకు పోరాటం
కేజ్రీవాల్‌కు మద్దతుగా దేశవ్యాప్త ఉద్యమం
మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై సీఎం కెసిఆర్ ఆగ్రహం
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే27: ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని సిఎం కేసీఆర్ ఆరోపించారు. బీజేపీయేతర పాలిత రాష్టాల్ల్రో కేంద్ర బీజేపీ బీజేపీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఎమర్జెన్సీపై బీజేపీ నేతలకు విమర్శించే నైతిక హక్కులేదని, ఇప్పుడు వారి తీరు అలాగే ఉందన్నారు. వారు అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో దిల్ల్ల్లీ సీఎం అర్వింద్ కేజీవ్రాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం ప్రగతి భవన్‌లో దిల్ల్ల్లీ సీఎం కేజీవ్రాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లతో కలసి కేసీఆర్ డియా సమావేశంలో మాట్లాడారు. లోక్ సభలో,రాజ్యసభలో తమ శక్తిని ఉపయోగించి.. దిల్ల్లీపై పెత్తనం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకునేలా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు అరవింద్ కేజీవ్రాల్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో దిల్ల్లీలో రెండు వింత ఘటనలు చూశాం. దిల్ల్ల్లీలో ఆమ్ ఆద్మీ ఎంత పాపులర్ అనేది దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుసునన్నారు. అరవింద్ కేజీవ్రాల్ నాయకత్వంలో సోషల్ ఉద్యమంతో వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. కేజీవ్రాల్ నాయకత్వంలో అప్రతిహతంగా మూడు పర్యాయాలు దిల్ల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కానీ కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు.
దిల్ల్లీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. అయితే ఒకటిగా ఉన్నదాన్ని మూడుగా చేసినా, కేంద్రం కుయుక్తులు చేసినా బీజేపీని తిరస్కరించిన ప్రజలు ఆప్ ను గెలిపించారు. మేయర్ ను ప్రమాణస్వీకారం చేయకుండా కేంద్రం అడ్డుకుందని మండిపడ్డారు. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే కానీ మేయర్ ను ప్రమాణ స్వీకారం చేయించే పరిస్థితి లేదన్నారు. రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించి భారీ మెజార్టీతో అరవింద్ కేజీవ్రాల్ మూడు సార్లు దిల్ల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అనుకున్నట్లుగానే భారీ మెజార్టీతో ఆప్ విజయం సాధిస్తే ఓర్వేలక కేంద్ర ప్రభుత్వం లెప్టినెంట్ గవర్నర్‌ను వీళ్ల నెత్తిద పెట్టి కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుందని కెసిఆర్ కేంద్రాన్ని విమర్శించారు. సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయిస్తే.. 5గురు సభ్యుల ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం కిందనే అధికారులు పనిచేయాలని ఆదేశించింది. గెలిచిన ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడ్డుకోవడమే అరాచకం అంటే, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా ఆర్డినెన్స్‌లు తీసుకొస్తున్న కేంద్రం తీరు చూస్తే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రధాని ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ తరహాలో ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. వరుసగా మూడు ఎన్నికల్లో బీజేపీ సహా జాతీయ పార్టీలను ప్రజలు తిరస్కరించారని కేసీఆర్ గుర్తుచేశారు.
ఆ మూడు ఎన్నికల్లోనూ దిల్ల్లీ ప్రజలు కేజీవ్రాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీకి దిల్ల్ల్లీ ప్రజలు మరోసారి తగిన బుద్ధి చెబుతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇకనైనా తమ ఆలోచనను మార్చుకుని, దిల్ల్లీలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులు పని చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రధాని నరేంద్ర మోదీ పాటించకుంటే ఎలా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు.. ఏం చేయదలుచుకున్నారని కేసీఆర్ అడిగారు. కర్ణాటకలో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా.. బీజేపీకి బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. మోదీ వంగి వంగి దండాలు పెట్టినా కూడా కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించారు. ఇలాంటి పరిణామాలు చూసి కూడా మోదీకి సర్కార్‌కు బుద్ధి రాలేదు. అండమాన్ పాలనకు, దిల్ల్లీ పాలనకు చాలా తేడా ఉంది. త్వరలో దేశం మొత్తం కూడా బీజేపీకి గుణపాఠం చెప్తుందన్నారు. దిల్ల్లీఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ప్రధానిని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకే విలువ లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అని మండిపడ్డారు. ఆర్డినెన్స్ పాస్ కాకుండా చేసేందుకు లోక్‌సభ, రాజ్యసభలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మోదీ పాలనలో ఎమర్జెన్సీ కంటే దుర్మార్గమైన రోజులను చూస్తున్నామని తెలిపారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైన స్వతంత్రంగా పని చేసుకునేలా కేంద్రం సహకరించాలి. అలంకారప్రాయమైన గవర్నర్ పదవులతో రాష్ట్ర పాలనను అడ్డుకోవడం దుర్మార్గం అని కేసీఆర్ మండిపడ్డారు.
ఆర్డినెన్స్‌లతో ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు
ఇది దిల్లీ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాలోచన
మోదీ సర్కార్ తీరుపై మండిపడ్డ కేజ్రీవాల్
ఇది దిల్లీ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్న దురాలోచన
మోదీ సర్కార్ తీరుపై మండిపడ్డ కేజ్రీవాల్
హైదరాబాద్,ప్రజాతంత్ర,మే27:
దిల్లీ ప్రజలను ఇది అవమానించడమే అన్నారు. ఇది దిల్ల్లీ ప్రజల సమస్య కాదు, ఇది దేశ ప్రజల సమస్య అన్నారు. సీబీఐ, ఈడీలతో బెదిరిస్తూ.. ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారని బీజేపీపై కేజీ ఆరోపణలు చేశారు. నాన్ బీజేపీ సర్కార్లను కూల్చివేయడం బీజేపీకి అలవాటు అయ్యిందన్నారు. దేశవ్యాప్తంగా తాను ప్రజల తరపున తిరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ గవర్నరే పాలన చేయాలనుకుంటే, అప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. నాన్ బీజేపీ పార్టీలు అన్ని ఒక్కటి అయితేనే బీజేపీ ఢీకొట్టగలమన్నారు. దేశ ప్రజల్లో విశ్వాసం నింపాలన్నారు. ఆజాదీని రక్షించుకోవాలంటే మోదీని ఓడించాలని కేజీ పిలుపునిచ్చారు.దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము పోరాటం చేస్తున్నట్లు పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ తెలిపారు. నీతి ఆయోగ్ టింగ్ ఇవాళ దిల్ల్లీలో జరుగుతోందని, కానీ అక్కడ చేసేది ఏలేదని, అందుకే తాము ఆ టింగ్‌ను బహిష్కరించినట్లు ఆయన చెప్పారు. టింగ్‌లను తమకు నచ్చినట్లే నిర్వహిస్తున్నారని భగవంత్‌మాన్ విమర్శించారు.



