- కలేకుంటే మోదీ, రేవంత్ దోస్తీ బయట పడ్డట్టే..క మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
- కసంగారెడ్డిలో బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం..
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : డీప్ ఫేక్ వార్తలను ప్రచారం చేసిన కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని, ఈ కేసులో సీఎంను అరెస్టు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు అస్సాంలో ఒకరిని అరెస్టు చేశారని, ఈ క్రమంలో రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలని, లేకుంటే మోదీకి రేవంత్‌కు మధ్య దోస్తీ బయటపడుతుందని హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో హరీష్ రావు మాట్లాడుతూ…గులాబి జెండా ఉండగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ వొచ్చాకనే అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, మహిళలకు రూ.2500 సాయం, తులం బంగారం ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ వొచ్చాక బంగారం ధర కూడా పెరిగిందని, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని, కాంగ్రెస్‌కు మళ్లీ వోటు వేస్తే హామీలు అమలు చేయరని చెప్పారు. బిజెపికి వోటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిల పడినట్లేనని, తెలంగాణకు ఆ పార్టీ ఎంతో నష్టం చేసిందన్నారు.
అలవి గాని హామీలు ఇస్తే గత ఎన్నికల్లో దుబ్బకాలో బీజేపీని చిత్తుగా 54 వేల వోట్లతో ఓడిరచారని తెలిపారు. ట్రస్ట్ ద్వారా వంద కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న వెంకట్రామిరెడ్డిని గెలిపిం చాలని కోరారు. ఎంపి అభ్యర్థి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ..11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీగా, జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్ గా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేశానని, ప్రజల ఆదరణను, ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేనని, ప్రజా సేవకుడిగా, వారిలో ఒకడిగా ఉండాలని వారి ఆశీర్వాదం కోరుతూ మెదక్ ఎంపీగా ప్రజల ముందుకు వొస్తున్నానని అన్నారు. తన ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి రూ. 100 కోట్లతో వెంకటరామ రెడ్డి ట్రస్టు ద్వారా సేవలందిస్తానని తెలిపారు. పేద పిల్లలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ, యువతకు స్కిల్ డెవలప్ మెంట్, మహిళా సాధికారత కోసం కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ప్రతిభ ఉండి, చదువుకోలేని పేద విద్యార్థుల విద్య అందిస్తనని చెప్పారు. విద్యార్థులకు ప్రతి నియోజకవర్గంలో ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు. నైపుణ్యత శిక్షణ పొందిన యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెగా జాబ్ మేలా నిర్వహిస్తానన్నారు. పేదింటి శుభకార్యాలకు ఒక్క రూపాయికే ఫంక్షన్ హాళ్లు. రూ.100 కోట్లకు అదనంగా మరో రూ. 14 కోట్లతో ప్రతి నియోజవర్గంలో రెండు అధునాతన ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తామని తెలిపారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్కరికి పూర్తి ఉచితంగా రూ.10 లక్షల ప్రమాద బీమా కవరేజ్ అందిస్తామని తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని వెంకట్రామిరెడ్డి కోరారు.




