మోదీకన్నా ముందే ఈడి వొచ్చింది
లీకులతో తమ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర
ఎలాంటి విచారణకైనా తాము సిద్దమే
ఎలాంటి కుంభకోణాలతో మాకు సంబంధం లేదు
ఎన్నికల్లో దెబ్బ తీసేందుకే ఈడి, ఐటిలతో దాడులు
8 ఏళ్లలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చారు
మోదీ తన పంథాను మార్చుకోవాల్సిందే
డియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
ఏం చేస్తారు..జైల్లో పెడతారు..పెడతారా పెట్టుకోండి… భయపడేది లేదు..ఈడీ•,ఐటి విచారణకు సంసిద్దంగా ఉన్నాం. ప్రధాని మోదీ రావడానికి ముందు ఈడీ వచ్చిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ, ఈడీలకు భయపేడది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తమపై కేసులు పెడుతున్నారని చెప్పారు. బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద డియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ’దేశంలో బీజేపీ పాలన వచ్చి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి. ఈ 8 సంవత్సరాల్లో 9 రాష్టాల్ల్రో ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చారు. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. కాబట్టి.. మోదీ వచ్చేముందే రాష్టాన్రికి ఈడీ వచ్చింది. తనపై, మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. మాపై కేసులు రాజకీయ ఎత్తుగడ తప్ప మరోటి కాదు. కెసిఆర్ ప్రభుత్వాన్న అస్థిరపాలు చేయాలన్న కుట్ర దాగి వుందన్నారు. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగే సమాధానాలు చెబుతాం. ఎలాంటి విచారణ ఎదుర్కోవడాని కైనా మేం సిద్ధంగా ఉన్నాం. ఈడీ, సీబీఐ, అన్నింటినీ ఎదుర్కొంటాం. మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇకనైనా పంథాను మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేసుకోండి.. భయపడేది లేదు’ అని కవిత అన్నారు. డియాకు లీకులిచ్చి తమ ఇమేజ్‌ను దెబ్బతీయలేరని చెప్పారు. ఈడీతో గెలవాలను కుంటే తెలంగాణలో కుదరదన్నారు. అత్యంత చైతన్యం కలిగిన ప్రజలున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రజలు తమ వెంట ఉన్నంతకాలం తమకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. దిల్లీ మద్యం స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ఇడి అధికారులు చేర్చిన నేపథ్యంలో కవిత డియాతో మాట్లాడారు. తన ద మంత్రులు, ఎంఎల్‌ఎల ద మోడీ ప్రభుత్వం కేసులు పెట్టిందని దుయ్యబట్టారు. బిజెపిది హీనమైన సంస్క•తి అని ధ్వజమెత్తారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చినట్లుగా ఈ• పేర్కొన విషయం తెలిసిందే. దిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో సౌత్ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించేవారని వెల్లడించిన విషయం విదితమే. దిల్ల్లీ మద్యం కుంభకోణంలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా దిల్లీ
మద్యం స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును ఇడి అధికారులు చేర్చారు.
అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చినట్లుగా ఈడీ పేర్కొంది. మంగళవారం రాత్రి అమిత్ ఆరోరాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే సౌత్ గ్రూప్ సంస్థ వంద కోట్ల రూపాయల ముడుపులను ఆప్‌కు చెల్లించినట్లు తేల్చారు. సౌత్ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించేవారని ఈడీ• వెల్లడించింది. ఈ గ్రూపు ద్వారా రూ.వంద కోట్లను విజయ్‌నాయర్‌కు చేర్చినట్లు ఈడీ తమ విచారణలో బట్టబయలు చేసింది.ఈడీ చేసిన దర్యాప్తులో అమిత్ ఆరోరా వాగ్మూలంలో ఈ విషయాలను స్పష్టంగా ధృవీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 36 మంది రూ.1.38 కోట్లు విలువ చేసే 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. వీటిలో తెలుగు రాష్టాల్రకు చెందిన ఐదుగురి 33 ఫోన్లను మాయం చేశారన్నారు. ధ్వంసం చేసిన సెల్‌ఫోన్లలో రెండు కవిత నెంబర్లు, పది మొబైల్ ఫోన్‌లు వాడినట్లు ప్రకటించారు. ఆమె వాడిన ఈ ఫోన్లు కనిపించకుండా పూర్తిగా ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కుంభకోణం తో ప్రమేయం ఉన్న భాగస్వాములు, అనుమానితుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. సాక్షాధారాలు, ముడుపుల వివరాలున్న డిజిటల్ డేటాను కూడా పూర్తిగా కనిపించకుండా చేశారని ఈడీ• దర్యాప్తులో తేలింది. వీరి వద్ద నుంచి కేవలం 17 ఫోన్లను మాత్రమే రికవరీ చేసినట్లు కోర్టుకు వివరించారు. ఈ స్కామ్‌లో ఎందరో మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు ఉన్నారని తమ విచారణలో ఇడి అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుల్లో దిల్లీ ఎక్సైజ్ శాఖ మంత్రి ఒకరు ఉన్నారని ఈడీ• ప్రకటించింది.
లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేదంటే ఎలా ?
అలా అయితే పదిఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సిద్ధిపేట,డిసెంబర్1: దిల్లీ లిక్కర్ స్కాంతో ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేకుంటే విచారణకు సహకరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రూ.100 కోట్ల నిధుల మళ్లింపులో ఆమె పాత్ర ఉందని ఈడీ విచారణలో తేలిందని చెప్పారు. స్కాంతో సంబంధం లేనప్పుడు కవిత 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేసిందని ప్రశ్నించారు. సాక్ష్యాలు తారుమారుచేయడం కూడా నేరమేనని అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వోట్లు అడగదని జీవన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చి ఉంటే లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యేవని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షను ప్రశ్నించడం, హక్కుల సాధనలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఏ హోదా లేనప్పుడే మెడలు వంచి ప్రత్యేక రాష్టాన్న్రి సాధించుకున్నామని చెప్పుకునే కేసీఆర్.. ఇప్పుడు సీఎం అయ్యుండి తెలంగాణ హక్కుల్ని కాపాడుకోలేకపోవడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. చట్టాలపై అవగాహన ఉన్నవారే చట్టసభల్లో ప్రాతినిధ్య వహించాలని సూచించారు.




