జార్జి రెక్కవిప్పిన రెవల్యూషన్‌..!!

అది తూర్పు దిక్కు
వియత్నాం విప్లవ హోరు
గాలులు విస్తున్న కాలం !
లాటిన్‌ అమెరికా
జాతీయోద్యమాలజి
అగ్ని పర్వతాలు వెగజల్లే
లావావేడి గాలులు..!
హిమగిరిరులను
మరి గిస్తున్న కాలం
సహారాఎడారి దేశాల
నల్ల బానిసలు
నైలునది కెరటాలై
సామ్రాజ్య పునాదులను
పెకలించి వేస్తున్న
రaంరaూనిల షడ్జ ద్యానాలు
విద్యాచనంలో
మర్నోగుతున్న రోజులు
పాలస్తీనా విమోచనోద్యమం
ఉష్ణరక్త కాసారపు
భుగ భుగలు పిడితప్రజల
రక్తనాళాలను ఉరుకలు
వేయించుతున్న కాలం
ఘనీభవించిన
ఓల్గాను త్రోసి రాజంటూ
పరవళ్ళు తొక్కుతున్న
యాంగ్జి నది నురగలు
మెరిసే మిలమిలలు
గంగ గోదావరిలపై
ప్రతిబిధిస్తున్న కాలం !
దేశాల స్వాతంత్రాలూ
జాతుల విమోచనాలూ
ప్రజల విప్లవాలు
కల్సి ప్రతిపక్షం కూటమిగా
చెట్టా పట్టలేసు కొని
దళారి పంతుల భూగోళంపై
పెను తుఫాన్లు సృష్టిస్తున్న
పళయ కాలం
విచిన చల్లని పైరగాలిలకు
కలకత్తా విశ్వవిద్యాలయ
ప్రాంగణపు ‘‘ విద్యావస్థ ‘‘
ఎర్ర గులబీలతో
విరబూసిన పరిమళాలను ..
నక్సల్బరీ వసంతం
శ్రీకాకుళం కొండల్లో
గోదావరి లోయలు
తెలంగాణ మాగాణాల
పయనించి ఉస్మానియాలోని
సామాజిక విజ్ఞాన జిజ్ఞాన
పరులను ..
ముక్క పుటలను సోకాయి !
సువాసనల కైపునుంచి
తేలుకోక ముందే
ప్యారిస్‌ విశ్వవిద్యాలయలలో
రెక్కవిప్పిన రివల్యూషన్‌
చప్పళ్ళ ప్రతిబింబించాయి !
ఆందీస్‌ కొండల
అమెజాన్‌ జలపాతలలో
ఎలక్ట్రిక్‌ ట ర్చైన్‌ మీద దూకి
చేగువేరా చైతన్య దీపం
జార్జి హృదయ సారలపై
పరివర్తన చెంది ఈ మెదడు
క్యాంపస్‌ లో ప్రగతిశీల దీపాలను
వెలిగించే యజ్ఞాన్ని తలపెట్టింది
వసతి భవనాల  వెంట
జీనా హైతో మరనా సిక్‌
కదమ్‌ కదమ్‌ పర్ల లడ్న సీకోక్స్‌
వీరగంధం పూసింది..!
తరగతి గది అనుభౌతిక
శాస్త్రమందు గోల్డ్‌ మెడల్‌
గతితార్కిక భౌతికవాదంలో
పాండిత్యం పొందింది
వేద వాదులు
నిలువెల్లా మండిపోయారు
ఆధర్మం నిప్పులు కురిపించింది
హిందుత్వం పడగ విప్పింది
మతోన్మాదం విషం కక్కింది
చీకటిలో బతికేందుకు
మతోన్మాద గబ్బిలాలు
వెలుతురు మీద పగ పట్టాయి
జ్ఞాన దీపాన్ని ఆర్పాలని
గోసులు బిగించాయి
మట్టి పెట్టాలని కత్తి కట్టారు
ఏప్రిల్‌ 14న
వెలుతురు మీద
చీకటి దాడి చేసింది
అక్కడికక్కడే ఆ మెదడు
ఆలోచించడం మానలేదు.
జ్ఞాన దీపం అరిపోయింది
అది విస్పోటనం చెల్లింది
ఆ విస్పోటన జ్ఞాన్ని పరమాణుపులుగా
రూపాంతరం చెంది !
అనంతశక్తిని విడుదల చేసింది
అది  %జుొవీజా% అనుభౌతిక
సూత్రం వంటి సామాజిక శక్తి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం
జగిత్యాల జగిత్యాయాత్ర మారుమ్రోగి
ఇంద్రవెల్లి దండకారణంలో
ప్రజా ఉద్యమానికి
నీవు అందించిన
జ్ఞాన దీపం ఆరిపోలేదు
లక్షకాంతి పుంజాలను
నిత్యనూతనంగా
విరజిమ్ముతుంది ఉన్నది.
(ఏప్రిల్‌ 14 జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా….)
-శోభ రమేష్‌
8978656327

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *