జహీరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యరి బిబి పాటిల్‌ కాన్వాయ్‌లో డబ్బులు పట్టివేత

మెదక్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : జహీరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ కాన్వాయ్‌లో డబ్బులు దొరకడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల కోడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా మెదక్‌ జిల్లా టెక్మాల్‌ మండలం బొడ్మాట్‌ పల్లి చెక్‌ పోస్ట్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేయగా బీబీ పాటిల్‌ కాన్వాయ్‌లో 1.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *