‘జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌’

మన ఊరు`మన బడి ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మహార్దశ
హెచ్‌ఎంలూ మీకు దండం పెడతా…స్పోర్ట్స్‌ కిట్స్‌ను రూముల్లో పెట్టకండి
త్వరలో మరిన్ని స్కూళ్లను డెవలప్‌మెంట్‌ చేస్తా
సిద్ధిపేట గర్స్ల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 9: ఒకప్పుడు  ప్రభుత్వ స్కూళ్లంటే  శిథిలావస్థలు..రాష్ట్రం ఏర్పడి కేసీఆర్‌ సిఎం అయ్యాక మన ఊరు`మన బడిని ప్రారంభించాక ప్రభుత్వ సూళ్లంటే కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నామనీ, ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పటి ప్రభుత్వ స్కూళ్లకు ప్రస్తుత ప్రభుత్వ స్కూళ్లకు జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిఎం కేసీఆర్‌ చొరవతో ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులతో మహార్దశ చేకూరిందన్నారు. బుధవారం సిద్ధిపేటలో 5కోట్ల రూపాయలతో నిర్మించిన గర్ల్స్‌ స్కూల్‌ అండ్‌ కాలేజీని టిఎస్‌డబ్ల్యూఐడిసి ఛైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ కలిసి ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…తెలంగాణ రాక ముందు ఒక్కటి లేని రెసిడెన్షియల్‌ కాలేజీలు నేడు 80 ఏర్పాటు చేసుకున్నామనీ,   ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాక ముందు 682 మాత్రమే ఉన్న రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉంటే నేడు 1012 స్కూల్స్‌ ఏర్పాటు చేసుకున్నామన్నారు.

తెలంగాణ రాక ముందు లక్షా 94వేల మంది విద్యార్థులు చదివితే, నేడు 7లక్షల 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు.   గత ప్రభుత్వాలు ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయలేదనీ,     2014కు ముందు రెసిడెన్షిల్‌ విద్యపై పెట్టిన ఖర్చు 970 కోట్లు, నేడు 4వేల కోట్లు ఖర్చు పెడుతున్నామనీ,  రెండు, మూడు రోజుల్లో బీసి రెసిడెన్షియల్‌ స్కూల్‌ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. మెస్‌ ఛార్జీలను పెంచామనీ, పెంచిన మెస్‌ ఛార్జీలను ఈ నెల నుండి అమలు చేయనున్నట్లు వెల్లడిరచారు. ఈ స్కూల్‌ను కార్పొరేట్‌ స్కూల్‌కంటే ఎక్కువగా తీర్చిదిద్దుకున్నామనీ, ఈ స్కూల్‌లో ఏర్పాటు చేసిన వసతులతో విద్యార్థుల్లోనూ ఆత్మవిశ్వాసం పెంచుతుందన్నారు. ఈ స్కూల్‌ వైపు అసాంఘిక శక్తులు చూడాలంటే భయపడేలా పోలీస్‌ యంత్రాంగం, మునిసిపల్‌ శాఖ, టీచర్లు అందరమూ కలిసి పని చేద్దామన్నారు. సిద్ధిపేటను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజాప్రతినిధులందరూ హోదాను మరిచి నడుస్తూ చెత్తను ఏరే కార్యక్రమాన్ని చేపడుతున్నారనీ, వారి మాదిరిగా టీచర్లు, లెక్చరర్లు కూడా ఈ విద్యా సముదాయంను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎన్నో వ్యయప్రయోసాలకు గురై ఈ విద్యా సముదాయాన్ని నిర్మించాననీ, అంతేస్థాయిలో కూడా ఫలితాలు రావాలన్నారు.

టెన్త్‌లో 10/10మార్కులు వచ్చిన  ఒక్కో విద్యార్థికి 10వేల రూపాయల నగదును ఇచ్చినట్లుగానే ఈ విద్యా సముదాయంలో చదువుకుంటున్న విద్యార్థులు టెన్‌ బై టెన్‌ తెచ్చుకుంటే ఆపిల్‌ ఐ ప్యాడ్‌ను  ఉచితంగా అందజేస్తాననీ అన్నారు. పట్టణంలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాల మాదిరిగానే ఈ విద్యా సముదాయం ఎదగాలనీ, ఈ స్కూల్‌ మాదిరిగానే రానున్న రోజుల్లో నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావు మండల కేంద్రాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు లక్షల రూపాయల విలువ చేసే స్పోర్ట్స్‌ కిట్స్‌ను ఇస్తున్నామనీ,  హెచ్‌ఎంలు మీకు దండం పెడుతా..స్పోర్ట్స్‌ కిట్స్‌ను రూముల్లో పెట్టకుండా విద్యార్థులకు ఇచ్చి ఆడిరచాలని కోరారు. చెత్తను బయట వేయొద్దని విద్యార్థులందరూ ఇంటికి వెళ్లిన తర్వాత తమ తల్లిదండ్రులకు  చెప్పాలన్నారు.

సరదాగా..ఆత్మీయంగా…చిన్నారులతో హరీష్‌రావు…
బడి.. బహుత్‌ అచ్చాయే… సార్‌..
బ్యూటీఫుల్‌గా ఉంది మా స్కూల్‌…
చాల బాగుంది సార్‌… నేను నేషనల్‌లో ఫస్ట్‌ వస్తా సర్‌…
నేను పోలీస్‌ అవుతా సర్‌…

సిద్దిపేట బాలికల విద్యా సముదాయం ప్రారంభోత్సవం లో చిన్నారులతో ఆత్మీయంగా ముచ్చటించిన మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట గర్స్ల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు చిన్నారులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు..  స్కూల్‌ ఎలా ఉంది.. సిద్దిపేట అభివృద్ధిలో ఏది బాగుంది.. రన్నింగ్‌లో ఫ్రైజ్‌ తెచ్చుకుంటారా…మంచిగా చదువుకొని ఏం అవుతారు అంటూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా చిన్నారులు సంతోషంగా సమాధానం ఇచ్చారు. అస్మా అనే విద్యార్థి మా స్కూల్‌ని బాగా చేశారు సర్‌.. బహుత్‌ అచ్చాయే సార్‌. మేము బాగా చదువుకొని మంచి పేరు తెస్తామన్నారు. సిద్దిపేటలో అన్ని బాగున్నాయి సర్‌.. కోమటిచెరువు, క్రికెట్‌ స్టేడియం ఇలా అన్ని బాగున్నాయి అని చెపుతూ వచ్చింది.  అభినయ అనే చిన్నారి స్కూల్‌ బ్యూటీఫుల్‌ ఉంది అంటూ.. స్కూల్‌ నచ్చిందని నేను ఇంట్లో ఉండకుండా హాస్టల్‌లో ఉండి చదువుతున్న సర్‌ అని చెప్పింది.

భవ్యశ్రీ నేను హైదరాబాద్‌ నుండి వచ్చి ఇక్కడ చదువుతున్న సర్‌… స్కూల్‌ గ్రౌండ్‌ బాగా చేశారు అంటూ చెప్పింది. ఇలా కాసేపు చిన్నారులతో ఒక తండ్రిలా..ఒక అన్నలా హరీష్‌రావు పిల్లలను దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా  ముచ్చటించడంతో అక్కడ  ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఒక మంత్రి అంటే..  బిల్డింగ్‌ ప్రారంభించి పోతారు. కానీ, మంత్రి హరీష్‌రావు మాత్రం ప్రారంభించడం కాదు విద్యార్థులకు ప్రారంభించిన విషయం తెలియాలి. మనం ఏం చేశాం, ఎందుకు చేశాం  అనేది విద్యార్థులకు తెలిసినప్పుడే మనం చేసిన పనికి సార్థకత అని మంత్రి హరీష్‌రావు మరోసారి నిరూపించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిసి ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మునిసిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్‌ పయ్యావుల పూర్ణిమ ఎల్లం, బిఆర్‌ఎస్‌ నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, సుధాకర్‌, మారెడ్డి రవీందర్‌రెడ్డి, పాల సాయిరాం, కాలేజీ ప్రిన్సిపల్‌, స్కూల్‌ హెచ్‌ఎం, టీచర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఎస్‌డబ్ల్యూఐడిసి ఛైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి, కాంట్రాక్టర్‌ బాపినీడు, శ్రీనివాస్‌రెడ్డిని శాలువా కప్పి మంత్రి హరీష్‌రావు సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *