జనాభాకు తగ్గట్లుగా… ఉద్యోగ అవకాశాలు కల్పించలేము

  • పాలమూరు అంటే ..ఒకప్పుడు మైగ్రేషన్‌..ఇప్పు‌డు పచ్చని పంటలతో ఇరిగేషన్‌
  • ‌తెలంగాణ అభివృద్దికి ఇదే నిదర్శనం
  • స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌
  • ‌నిర్మాణానికి కేటీఆర్‌ ‌భూమిపూజ
image.png
మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌8: ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ అం‌టే మైగ్రేషన్‌ అని.. ఇప్పుడు మహబూబ్‌నగర్‌ అం‌టే ఇరిగేషన్‌ అని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పాలమూరును పచ్చబర్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఎర్ర తివాచి పరిచామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్‌ ‌జిల్లా దేవరకద్ర మండలం మూసాపేట మండలం వేముల వద్ద 500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎస్‌జిడి కార్నింగ్‌ ‌కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తారక రామారావు మాట్లాడుతూ దేశంలో జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేమని, అందువల్ల ప్రైవేట్‌ ‌లో పెట్టుబడులు ఆహ్వానించి ఉద్యోగాలు కల్పించే విధంగా చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వేముల వద్ద ఏర్పాటుచేసిన ఎస్జిడీ కార్నింగ్‌ ‌కంపెనీ ద్వారా 1500 నుండి 2000 మంది వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇటీవలే దిటిపల్లి వద్ద 9500 కోట్లతో అమరరాజా కంపెనీని ఏర్పాటు చేశామని, మహబూబ్‌నగర్‌
‌జిల్లాలో ఐటి హబ్‌లో ఎంతోమందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం 9 బిలియన్ల వ్యాక్సిన్‌కు హబ్‌గా ఉందని, నూతన పారిశ్రామిక విధానంతో టి ఎస్‌ ‌బి పాస్‌ ‌వల్ల 15 రోజుల్లోనే కంపెనీలకు అనుమతిస్తుండడంతో కంపెనీలు  పెట్టుబడులు పెట్టేందుకు ఎర్రతివాచి  పరిచామని, దేశంలో 142 కోట్ల జనాభాకు కేవలం 59 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని, అదే తెలంగాణలో నాలుగు కోట్ల జనాభాకు ఆరున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, కేసీఆర్‌ ‌నాయకత్వంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరిగిందన్నారు. 2014 లో దేవరకద్ర నియోజకవర్గంలో కేవలం 40 వేల ఎకరాలకు సాగునీరు  అందేదని,అలాంటిది మిషన్‌ ‌కాకతీయ ద్వారా 434 చెరువులకు మరమ్మతులు చేపట్టి చెరువులను నింపుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 30 చెక్‌ ‌డాములు పూర్తి చేశామని, 2014లో 40 వేల ఎకరాలు సాగవుతే 2023లో 98 వేల ఎకరాలు సాగైందని, కరివేన రిజర్వాయర్‌ ‌పూర్తయితే 1,60,000 ఎకరాలకు సాగునీరు వస్తుందని, అప్పుడు భూతద్దం పెట్టి వెతికిన  కరువుఅనేది కనపడదని మంత్రి వెల్లడించారు. దేవరకద్ర నియోజకవర్గంలో  65 వేల మంది రైతులకు 9000 కోట్ల రైతు బంధు ఇచ్చామని, 40 వేల మందికి వందల కోట్ల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ ‌కింద 1900 మందికి సహాయం ఇచ్చామని, సీఎంఆర్‌ఎఫ్‌ ‌కింద 8000 మందికి సహాయం అందించామని, దేవరకద్ర, కొత్తకోటలలో ఆసుపత్రులు మంజూరు  చేస్తామని  మంత్రి తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా ఉందని, ఒకప్పుడు ధాన్యం పండించడంలో పంజాబ్‌ అ‌గ్రస్థానంలో ఉంటే ఇప్పుడు తెలంగాణ ముందు వరుసలో ఉందని, గతంలో ఏ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వలేదని ,అలాంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు దర చెల్లించి కొంటున్నదన్నారు. రాష్ట్ర ఎక్సైజ్‌ , ‌క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ ‌వి. శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ ఇటీవల దిటిపల్లి వద్ద ఐటీ టవర్‌ ‌ను ప్రారంభించామని, అతిపెద్ద బ్యాటరీ కంపెనీ అమర రాజా కంపెనీని ఏర్పాటు చేశామని, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే పాలమూరు కరువు తీరిపోతుందని అన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ 2014లో. రాష్ట్రం  ఏర్పాటు కాక ముందు ఒకే ఒక యూనిట్‌ ‌ను  స్థాపించిన ఎస్జీడి కార్నింగ్‌ ‌కంపెనీ ఇప్పుడు కొత్త యూనిట్‌ ‌ప్రారంభించడం సంతోషమని అన్నారు. ఇటీవలే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అమెరికా వెళ్లి 43 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చారని, కేటీఆర్‌ ‌స్ఫూర్తితో పనిచేస్తామని అన్నారు. గతంలో జిల్లా నుండి ప్రజలు వలస వెళ్లే వారిని ఇప్పుడు వలసలు వాపసు వస్తున్నారని, జిల్లాలోని ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలంటే రాబోయే కాలంలో మరిన్ని పరిశ్రమలు తీసుకురావాలని, మూసాపేట లో 15 ఎకరాల స్థలాన్ని పరిశ్రమల ఏర్పాటుకు గుర్తించామని ,ఇప్పుడు పాలమూరు జిల్లా సస్యశ్యామలమైందని ,పాలమూరు- రంగారెడ్డి పూర్తయితే 12 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని, ఆగస్టులోగా పాలమూరు- రంగారెడ్డి ద్వారా సాగునీరు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయని, వాటికి 50 కోట్ల నిధులు మున్సిపల్‌ ‌శాఖ మంత్రి తారక రామారావు ఇదివరకే ఇచ్చి నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేవరకద్రను మున్సిపాలిటీ చేయాలని, అదే విధంగా టి ఎఫ్‌ ఐ ‌డి కింద 30 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్‌ ‌సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌జి. రవి నాయక్‌, ఎస్‌ ‌పి కే. నరసింహ, అచంపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్‌  ‌గువ్వల బాలరాజు ఎస్‌ ‌జి డి  కారనింగ్‌ ‌సంస్థ ఎండి అక్షయ్‌ ‌సింగ్‌, ‌డైరెక్టర్‌ ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌శక్తి నాగప్ప, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణలో సకృత అభివృద్ది
తెలంగాణలో సకృత అభివృద్ధి కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్‌  అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా వేములలో ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్‌ ‌టెక్నాలజీ ప్లాంట్‌ ‌నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కరంటు, తాగు, సాగునీళ్లు ఇవ్వనోళ్లు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని విమర్శించారు. లైఫ్‌సైన్స్ ‌రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి నాయకత్వంలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతు న్నదని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధిక చెక్‌డ్యాంలు నిర్మించిన నియోజకవర్గం దేవరకద్ర అని చెప్పారు. దేవరకద్రలో రెండు ప్రభుత్వ దవాఖానల నిర్మాణం చేపడుతామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దేవరకద్ర నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ ‌కృషితోనే తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతున్నదని చెప్పారు.
అంతకుముందు భూత్పూర్‌లో మున్సిపల్‌ ‌పార్కు, ఓపెన్‌ ‌జిమ్‌లను మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే.. యాటకూర తిన్నాక.. తోటకూర తిన్నట్లు ఉంటదని మంత్రి కేటీఆర్‌ ‌ఛలోక్తి విసరారు. దేవరకద్రలో అప్పుడు 2014లో కేవలం 40 వేల ఎకరాల భూమికి సాగు నీరు అందేదని.. ఇపుడు ఎక్కడికక్కడ 30 చెక్‌ ‌డామ్‌ ‌లు కట్టడంతో.. లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతోందన్నారు. కర్వెన పూర్తి అయితే మరో 60 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. అంతకుముందు  మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్ల క్రితం వరకు పాలమూరులో నీళ్లు, కరెంటు, రోడ్లు లేవని అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీలు చేసిందేలేదని… వారికి ఓట్లడిగే హక్కు లేదన్నారు. తెలంగాణ సస్యశ్యామలమైందని.. దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. మంత్రి కేటీఆర్‌ ఇతర దేశాలకు వెళ్లి పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడులు తీసుకొస్తున్నారని అన్నారు. అమెరిక తర్వాత కార్పోరేట్‌ ఆఫీసులకు హైదరాబాద్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్‌గా మారిందన్నారు. కమాండ్‌ ‌కంట్రోలర్‌ ఆఫీసు అమెరికా, ఇంగ్లాండ్‌ , ‌సింగపూర్‌ ‌తర్వాత హైదరాబాద్‌లో ఏర్పాటు అయ్యిందన్నారు. ఇక రాష్టాన్రికి ఫారెనర్లు క్యూ కడుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టులో జాగలేదని… రెండో ఎయిర్‌ ‌పోర్టు పాలమూరులనే కట్టవలసి వస్తదని మంత్రి మల్లారెడ్డి పేర్కొంది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌మల్లారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి పాల్గొన్నారు.
image.png
పాలమూరు పర్యటనలో మంత్రులు
పలు అభివృద్ధ్ది పనులకు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8:  ‌మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో మంత్రి కేటీఆర్‌ ‌పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసారు. ఇందులో భాగంగా మూసాపేట మండలం వేములకు చేరకున్న మంత్రి కేటీఆర్‌.. ఎస్‌జీడీ  ఫార్మా కార్నింగ్‌ ‌టెక్నాలజీ ప్లాంట్‌  ‌నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మైక్రో రూరల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌ ‌నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎం‌పీ మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌లో (మున్సిపల్‌ ‌పార్కు, ఓపెన్‌ ‌జిమ్‌లను ప్రారంభించారు.అంతకుముందు హైదరాబాద్‌ ‌నుంచి హెలికాప్టర్‌లో భూత్పూర్‌ ‌చేరుకున్న మంత్రులు కేటీఆర్‌, ‌మల్లారెడ్డికి మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎం‌పీ మన్నె శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు ఘనంగా స్వాగతం పలికారు.నంతరం ముసాపేట మండలం వేములలోని ప్రైవేటు కంపెనీ యూనిట్‌కు, మైక్రో రూరల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌ ‌నిర్మణానికి, మహబూబ్‌నగర్‌లోని బాలికల ఐటీఐలో శంకుస్థాపన చేసారు. తర్వాత అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలోని ఎర్రగుట్టలో డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్దిదారులతో కలిసి గృహప్రవేశం చేస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *