చౌకగా లభించే జెనరిక్‌ ‌మందులు వాడాలి

నా చిన్నతనంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు అనగా దగ్గు, దగ్గుపడిశం జ్వరము కాలిన గాయాలకు, శరీరానికి పుండ్లు అయినప్పుడు ఇతర రోగాలకు ఇంటిలోనే ప్రకృతి వైద్యం అందించేవారు. ముఖ్యంగా సొంటి, మిరియాలు, ఎల్లిపాయలూ, ఎల్లిపాయకారం నేల గంధం మొదలగు వాటితో చికిత్స చేసేవారు. ఎల్లిపాయ కారాన్ని రోటి మిఠాయి అని కూడా అనే వారు ఇది సర్వరోగ నివారిణికి ఉపయోగపడేది. ఈ సుగంధ ద్రవ్యాలతో అనేక రోగాలు మటుమాయం అయ్యేవి అప్పటి ఆహార అలవాట్లు మరియు పండించిన పంటలు ప్రకృతితో ముడిపడి ఉండేవి.

కానీ ప్రస్తుతం పంటలు పండించడంలో అనేక మార్పులు సంభవించి లాభాపేక్ష మరియు అధిక దిగుబడి ధ్యేయంగా పంటలను పండింస్తున్నారు. ఈ ఆహార ధాన్యాలు సేవించి ప్రతి మనిషి నిత్యం ఏదో ఒక రోగంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ రోగాలను నయం చేసేందుకు ఇంగ్లీష్‌ ‌మందులు మార్కెట్లోకి వచ్చినవి. ఈ మందులు అత్యంత ఖరీదైనవి మరియు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. ఈ మందులు వాడడం వలన ఇతర రోగాలు కూడా వస్తున్నట్లు మనం గమనిస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండడ్‌ ‌పేర్లతో అనేక రకాల మందులను రంగురంగుల సిట్రిపులతో మార్కెట్లోకి విడుదల చేసి సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. డాక్టర్లు కూడా ఇవే మందులను చీటిలపై రాసి ఈ మందులను వాడకపోతే రోగం నయంకాదనే స్థితికి మనుషులను తీసుకుని వచ్చినారు.

డాక్టర్లు ఈ మందుల కంపెనీలతో కుమ్ముక్కై ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అసలు మన దేశంలో ఈ బ్రాండ్‌ ‌పేరుతో తయారవుతున్న ఔషధాలు విదేశాల బ్రాండెడ్‌ ‌కంపెనీల నుండి కాపీ చేసి ఇక్కడ బ్రాండడ్‌ ‌పేరెన్నికగన్న కంపెనీల పేరుతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. బ్రాండెడ్‌ ‌కంపెనీలు తయారు చేసే మందుల పై వారికి పేటెంటు హక్కు 17 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తరువాత ఈ మందులు జనరిక్‌ ‌గా మార్కెట్లో విడుదలవుతాయి. ప్రస్తుతం మన దేశంలో ఈ తరహా వ్యవహారం ఔషధాల అమ్మకాలలో జరుగుతున్నది. అమెరికాలో దాదాపు 60 శాతం జనరిక్‌ ‌మందుల వినియోగిస్తారు.స్పెయిన్‌ ‌దేశంలో తప్పనిసరిగా జనరిక్‌ ఉపయోగించాలి అని చట్టం కూడా చేసుకొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో డ్రగ్‌ ‌మాఫియా ఏలుబడి రాజ్యం సాగిస్తున్నది. డాక్టర్లకు బహుమతులు ఆశ చూపి తప్పనిసరిగా తమ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న మందులను రోగులకు రాయాలని శాసిస్తున్నారు. డాక్టర్లకు వినోదాలు విందులు రకరకాల బహుమతులు,విదేశాలకు విహారయాత్రకు రకరకాల ఏర్పాట్లు చేసి ఈ డ్రగ్‌ ‌మాఫియా ప్రజలను పీల్చిపిప్పి

మన దేశంలో దాదాపు 20 ఏళ్ల క్రితమే జెనరిక్‌ ‌మందులు వాడుకలోనికి వచ్చిన తగినంత ప్రచారం లేక ప్రజలు వీటి వైపు మొగ్గు చూపలేదు. ఇంకా ఈ మందుల పై పలు అనుమానాలతో కొనడానికి ముందుకు రావడం లేదు. వీటిలో దాదాపు 200 రకాలు మందులు 20 నుంచి 80 శాతం తగ్గుదలతో లభిస్తున్నవి. బిపి షుగర్‌ ‌దగ్గు జ్వరము మొదలైన వాటికి మందులు లభ్యమవుతున్నాయి. డాక్టర్లు కూడా ఈ జనరిక్‌ ‌మందులు చీటీలలో రాయడం లేదు మరియు గజిబిజి రాతలతో ప్రజలకు అర్థంకాక సతమతమవుతున్నారు. ఒక్కొక్కసారి మందుల దుకాణాలు వారు కూడా ఈ రాతలతో తంటాలు పడుతుంటారు.

డాక్టర్లు తప్పనిసరిగా జెనరిక్‌ ‌మందులు స్పష్టంగా తెలిసినట్లు రోగి నిర్ధారణ పత్రంలో రాయుటకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి లేనిచో వారి గుర్తింపును రద్దు చేయాలి. జనరిక్‌ ‌మందుల వైపు ప్రజలకు అవగాహన కల్పించుటకు ప్రభుత్వం విస్తృతమైన ప్రచారా ఏర్పాటు చేయాలి. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లో, పాఠశాలలో, దవాఖానాల వద్ద ఇంకా ఇతరమైన ముఖ్య ప్రదేశాలలో ఫ్లెక్సీలు పెట్టాలి. పత్రికలు మరియు టీవీలలో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలు జనరిక్‌ ‌మందులు వాడేటట్లు చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది తద్వారా ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం చేయవచ్చు. విధిగా ప్రభత్వ ప్రైవేట్‌ ‌హాస్పిటలలో కూడా జనరిక్‌ ‌మందుల దుకాణాలు ఏర్పాటు చేయాలి.
– దండంరాజు రాంచందర్‌ ‌రావు, రిటైర్డ్ ‌డిప్యూటీ సూపరింటెండెంట్‌
‌సింగరేణిభవన్‌ ‌హైదరాబాద్‌ ‌మరియు అధ్యక్షుడు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్‌ ‌హైదరాబాద్‌-9849592958

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *