భారతదేశానికి స్వాత ంత్య్రం వచ్చి 75 వసంతాల సంద ర్భంగా అమృతోత్సవాలు జరుపు కుంటున్న వేళ నేడు దేశంలో అభివృద్ధికి కీలక భూమిక పోషించే విద్యా వ్యవస్థ స్థితిగతులను పరిశీలిద్దాం..
దేశంలో ఆంగ్లేయులు ప్రవే శపెట్టిన ‘‘మెకాలే’’ విద్యా విధానం వలన బానిసలు(సేవకులు)గానే తయారు చేస్తుందనే అపవాదును అధిగమించాల్సి ఉంది. పాలక వర్గాలు కొన్ని మార్పులను చేస్తూ, విద్యారంగ సమస్యల మూలాల్ని వెతుక్కుంటూ పట్టభద్రుల తయారీ ఖార్కానాల్లా మార్చకుండా, సమర్ధ మానవ వనరులను తయారు చేసేలా ఉన్నత ప్రమాణాలతో విద్యా విధానాన్ని రూపుదిద్దాల్సి ఉంది. దానికి పునాది స్థాయి ప్రాథమిక స్థాయి నుంచి విశ్వ విద్యాలయ, సాంకేతిక విద్యా వ్యవస్థల వరకు సంస్కరించడం నేడు అత్యంత ఆవశ్యకం. అలా ఏదేశ(జాతి) అభివృద్ధికైనా అత్యంత ప్రధానమైంది నాణ్యమైన విద్యా బోధన విధానాలు, సృజనాత్మకత పరిశోధనలే. ప్రపంచ స్థాయిలో నాణ్యమైన మానవ వనరుల్ని అభివృద్ధి చేస్తున్న, డెన్మార్క్ ఫిన్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్‌లు ఉచిత నాణ్యమైన విద్యనందిస్తూ ముందంజలో ఉన్నాయి. కాని మనదేశంలో మౌళిక వసతుల కొరత, బోధన సిబ్బంది కొరతతోపాటు రాజకీయ జోక్యానికి నిలయంగా మారుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విదేశీ అనుభవాల నుంచి పాఠాలు స్వీకరించి దేశీయ అవసరాలను తీర్చేలా ఉపాధి, ఉద్యోగాల కల్పనతో పాటు దేశం అభివృద్ధి జరగాలి. విద్యావేత్తల (నిపుణుల) సూచనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కాలానుగుణ మార్పులతో పాఠ్యప్రణాళికలు, బోధన విధానాలను సమీక్షిస్తూ నైపుణ్యాలు కల్గిన రేపటి తరం మానవ వనరులను సృష్టించాల్సి ఉంది.
మనదేశంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా కమిషన్ లు వేస్తున్నారు. నివేదికలు సమర్పిస్తున్నప్పటికీ పాలకులు అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అలా హంటర్ కమిషన్ -1882, హార్టాగ్ కమిటి -1929, సార్జెంట్ నివేదిక-1944, రాధాక్రిష్ణన్ కమిషన్(సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్)-1952,కొఠారి కమిషన్ (భారతీయ విద్యా కమిషన్)-1964-66, జాతీయ విద్యా విధానం-1986, నూతన జాతీయ విద్యా విధానం -2016-17, నూతన జాతీయ విద్యా విధానం -2020 లాంటి విద్యా కమిషన్ లు వేసి పాలకులు అమలు చేయకుండా చుట్టచుట్టి అటకెక్కించినవి కొన్నైతే మరికొన్ని రాజకీయ రంగులు పులుముకుంటున్నాయని నిపుణులు, విద్యావేత్తలు భావిస్తున్నారు. ఆధునిక సమాజం విసురుతున్న సవాళ్లను ధీటుగా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన విద్యార్థుల జ్ఞానకేంద్రాలైన తరగతి గదులను, పాఠ్యప్రణాళికలను, పాఠ్యాంశాలను శాస్త్రీ వైకరులకు బదులు అంధవిశ్వాసాలను, మత చాందసవాదాలతో, పార్టీలు, నాయకులు ఇష్టానుసారంగా మార్చుచున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ధన, మాన, ప్రాణాలను త్యాగాలు చేసిన అమరులకు స్థానం దక్కడం లేదు. రాజ్యాంగ రచనలో అసమాన ప్రతిభ కనబరిచిన అంబేద్కర్ పోషించిన పాత్రను కుదించుచున్నారు. ప్రగతిశీల భావాల రచయితల రచనలను పాఠ్యాంశాల్లోంచి తొలిగిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణమైన మార్పులకు ఎవ్వరు అభ్యంతర పెట్టరు. విద్యా రంగ నిపుణులతో చర్చించి అవసరమైన సూచనలతో శాస్త్రీయ దృక్పథంతో పాఠాలు సవరిస్తే అందరు ఆహ్వానిస్తారు. రాజకీయ ప్రయో జనాలు నెరవేర్చకోవడం కోసం దుర్విధానాలు అవలం భించడం మంచిది కాదు.
ఐక్యత, సామాజిక న్యాయం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాల్సిన చోట సంకుచిత భావాలు, పసి మెదళ్లలో వైషమ్యాల విత్తులు నాటి జాతి నిర్మాతల్లో నైతిక విలువలు, సామాజిక స్ప•హ, సమానత్వం భావాలకు బదులు స్వార్థ ప్రయోజనాలు పెంచడం భరతజాతికి ఏమాత్రం క్షేమం కాదు ! ఎవరు అధికారంలో ఉంటే వారి సొంత ఎజెండాలు, సిద్ధాంతాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుకుంటూ పోతే ఈ దేశానికి చేటు కాలం దాపురించినట్లేనని నిపుణులు భావి స్తున్నారు. నెహ్రూ, గాంధీ లకు పుస్తకాలలో స్థానం తగ్గుతుంది. విద్యా వ్యవస్థ తరగతి గదులు, పాఠ్యపుస్తకాలను, అధికారంలో ఉన్నవారి చిత్తానికి తగినట్లు చరిత్రలో మార్పులు చేసుకుంటూ పోతే ఎలా ! అభం శుభం తెలియని పిల్లలకు వాస్తవాలు తెలి సేదెట్ల ? భావజాల వ్యాప్తి కేంద్రాలుగా మార్చుకుని అర్థసత్యాలను, అసత్యాలను, వ్యక్తిగత విశ్వాసాలకు, వాస్తవాలకు, మూఢ విశ్వాసాలకు శాస్త్రీయ వైఖరులకు తేడా తెలియకుండా చేస్తే రేపటి సమాజం ఏమైపోవాలనే ఆవేదనను విద్యావేత్తలు, ప్రజా సంఘాలు వెలబుచ్చుచున్నారు. వారు లేవనెత్తిన అభ్యంతరాలను పాలకులు పరిష్కరించాలి. వైజ్ఞానిక దృక్పథం, మానవతా వాదం, జిజ్ఞాస, సంస్కరణాసక్తులను పెంపొం దించుకోవడం భారతీయ పౌరుల ప్రాథమిక విధిగా రాజ్యాంగం నిర్ధేశిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020లో వివాదస్పద అంశాలకు పాల్పడుతుందని రాజకీయ పార్టీలు, మేధావులు సవరించాలని గగ్గోలు పెట్టినా చట్టం చేసి రాష్ట్రాలపై బలవం తంగా రుద్ధుతుంది. ఇప్పటికి చాలా రాష్ట్రాలు దీనిని అమలు చేయబోమని చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం పార్టీ అధికారం ఉన్న చోట దీని అమలుకు సిద్దమన్నారు. కలిసికట్టుగా విద్యా వ్యవస్థను చదువులను ప్రక్షాళన చేయవల్సిన చోట వైషమ్యాలు చోటు చేసుకోవడం మన దేశానికి క్షేమం కాదు. ప్రపంచ దేశాల ముందు ఆధునిక నైపుణ్యాలు గల రేపటి తరానికి రాజకీయ రంగు పులమడం భావ్యం కాదు.
నాటి ‘‘మెకాలే’’ విద్యా విధానం అసమగ్రంగా ఉందని ఆడిపోసుకున్నం. నేడు మనవాళ్ల పాలనలో ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడాలి. ప్రతి వ్యక్తిని సమర్ధ ప్రగతిశీల వనరుగా తీర్చి దిద్దేలా రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు సంఘటితంగా నిపుణుల, విద్యావేత్తల నేతృత్వంలో పౌరులందరిలో సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఆధునిక నైపుణ్యాలు పరిఢవిల్లాలి. ప్రగతి మార్గాన చదువులను చక్కపెట్టాలి. నవత రంలో సమగ్ర సంస్కరణలతో వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడాలి. ప్రపంచ స్థాయిలో ప్రతిష్టను పెంచాలి.
ప్రస్తుత పరిస్థితి:
రాజకీయాల్లో విద్యారంగంపై శ్రద్ధ లోపించడం, విద్యా రంగంలో రాజకీయాలు ప్రజల భాగస్వామ్యం పేరుతో చొరబడటము వలన విలువల పతనానికి ముఖ్య కారణంగా మారింది. అంతేకాదు పాలకులకు మద్య విధానంపై ఉన్న శ్రద్ధ, ప్రాధాన్యత విద్య, పాఠశాలల నిర్వహణ మీద లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినప్పటికీ వాటి నిర్వహణకు అవసరమైన నిధులు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లు ఏ ఒక్కటి పరిష్కరించకుండా కాలయాపన చేస్తుంది. కనీసం పాఠశాల పరిశుభ్రతకు స్కావెంజర్ల నియామకాలు, స్టేషనరీ ఖర్చులు, సుద్ధముక్కలు కొనడానికి కనీస నిర్వహణ ఖర్చులక• డబ్బుల్లేక సమస్యలతో సావాసం చేస్తున్నారు విద్యార్థులు, ఉపాధ్యాయులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘‘సమగ్ర శిక్షా అభియాన్’’ ద్వారా నిధులు ఇవ్వడంలో ఒకరిపై ఒకరు నెపాన్ని చెప్పుచూ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మన రాష్ట్రంలో సుమారు 25 వేల వరకు పాఠశాలలు ఉండగా వాటికి పాఠశాల విద్యాశాఖ రెండు విడతలుగా స్కూల్ గ్రాంట్ ఇస్తారు. 2020-21లో సగం నిధులనే ఇచ్చారు.
అలాగే 2021-22 విద్యా సంవత్సరంలో చివరి విడత కింద 50 శాతం నిధులను మార్చి నెలాఖరులో ఇచ్చి, ఆ వెంటనే ఏప్రిల్ నెలలోనే వెనక్కి తీసుకున్నారు. కావున ఇప్పుడు ‘0’ బ్యాలన్సుగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశానుసారం ‘బడిబాట’ నిర్వహణకు ఒక్క పైసా ఇవ్వకుండా ఎజెండా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బ్యానర్లు, కరపత్రాలు, తరగతుల వారిగా హాజరు రిజిష్టర్లు, చాక్‌పీసులు, డస్టర్లు, చీపుర్లు, మూత్రశాలలు శుద్ధం చేయుటకు ఫినాయిల్, కొరోనా జాగ్రత్తలో భాగంగా హ్యాండ్‌వాష్, శానిటైజర్లతోపాటు పారిశుద్ధ్య కార్మికులు లేక గ్రామ పంచాయితి సిబ్బంది అవసరాలకు అందకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక సమస్యలతో కాలం వెళ్ళ్లదీస్తున్నారు. ‘‘మన ఊరు-మన బడి’’ మన బస్తీ, కార్యక్రమం ప్రచార పటాట•పమే కాని పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. దీనికి కూడా నిధుల కొరతేనని తెలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీరు నిధులు ఇవ్వడం లేదంటే మీరే ఇవ్వడం లేదని నిధుల నెపాన్ని ఒకరిపై ఒకరు తోసేస్తూ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరోవైపు ఇన్ని సమస్యల్లో ఉన్న సర్కారు బడులకు పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు ఇష్టం లేక ప్రైవేట్ బాట పట్టుచున్నారు. ఎటువచ్చి పేద, మధ్య తరగతి వారికి ఉచిత విద్యను అందించాలో ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేక పోవుచున్నాయి. ఇలా విద్యా శాఖలో 8 ఏళ్లలో సుమారు 9,456 కోట్ల నిధులు వృధా అయినట్లు తెలుస్తుంది. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై శ్రద్ధతో చిత్తశుద్దితో నిధులను, నియామకాలను, మౌళిక వసతులను కల్పించి అందరికి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి. భవిష్యత్తు తరాల నాణ్యమైన జీవన విధానానికి తోడ్పాటు అందించాలి. ఇది రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు, దీనిని సమకూర్చాల్సిన బాధ్యత పాలకులదేనని మరువరాదు.
మేకిరి దామోదర్, సోషల్ అనలిస్ట్, వరంగల్, 9573666650





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల