నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన ఎసిబి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : గొర్రెల పంపిణీ స్కామ్‌లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణెళిష్ ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దర్యాప్తులో ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై..నకిలీ బినావిూ ఖాతాలతో దాదాపు రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని అధికారులు తేల్చారు.
గొర్రెల పంపిణీలో కుంభకోణం




