గురుదేవో… నమోస్తుతే

గురువర్యా !
అమ్మ ఒడిలాంటి
మీ బడి సన్నిధిలోనే కదా
బతుకు పాఠం నేర్చుకుంది

మీ విజ్ఞాన జ్యోతులే కదా
భవిత దారి చూపుతుంది

మమ్ము ఉన్నతులు చేయ
మహర్షిగా అవతరించారు

విజ్ఞానులుగా తీర్చిదిద్ద
మేధో మధనం చేశారు

విజ్ఞాన సుధా రసాలు
మదిలో నిక్షిప్తం చేశారు

శిలలం మేమైతే..
శిల్పులు మీరయ్యారు
క్రియలు మేమైతే..
కర్తలు మీరయ్యారు

విరులం మేమైతే
కాపరి మీరయ్యారు
కంటిపాప మేమైతే
రెప్పలు మీరయ్యారు

జీవన చిత్రం మేమైతే..
సప్త వర్ణం మీరయ్యారు

మా ఉన్నతి కోసం
దేశ భవిష్యత్‌ ‌కోసం
జీవితము సమర్పించి
గుండెలో కొలువయ్యారు

మీ స్ఫూర్తి పథంలో నడిచి
ఉన్నతులుగా అవతరించేం
విశ్వమయ ప్రేమలు పంచేం

ఆచార్య దేవా!
మీకు అక్షర ప్రణతులు

(సెప్టెంబర్బ్5 ‌న గురు పూజోత్సవం సందర్భంగా…)
  – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *