గిరిజన యూనివర్శిటీ ఆలస్యానికి కారణం కేసీఆర్‌

బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ ఏనాడు హామీ ఇవ్వలేదు..
కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్‌ రెడ్డి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు గత పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు.గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వకుండా గిరిజనులకు అన్యాయం చేస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యూనివర్శిటీ కోసం కావాల్సిన స్థల సేకరణ విషయం ఇంకా తేల్చలేదు.. ఇంకా 50 ఎకరాలు క్లియరెన్స్‌ రావాల్సి ఉందన్నారు.
ఆంధ్రప్రేదేశ్‌ రాష్ట్రంలో యూనివర్శిటీ మంజూరు అయింది. నిధులు కూడా మంజూరయ్యాయి..
కానీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ దగ్గర తప్పు పెట్టుకుని అనవసర విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ట్రైబల్‌ యూనివర్శిటీకి భూసేకరణకు సంబందించి స్థలాన్ని గుర్తించాలని ఇప్పటివరకు 9 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసిందనీ..రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ములుగులో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రకటించిందన్నారు.అద్దాల మేడలో కూర్చొని రాళ్లతో కొడితే మీ అద్దాలే పగులుతాయని సూచిస్తూ..గిరిజన యూనివర్శిటీ ఆలస్యానికి కారణం… చేతగాని దద్దమ్మ కేసీఆర్‌ ప్రభుత్వమే..అన్నారు. అబద్ధాలు ఆడటంలో, ప్రజలను మభ్యపెట్టడంలో కల్వకుంట్ల కుటుంబానికి నోబెల్‌ బహుమతి ఇవ్వొచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలనే ఆలోచన లేదు..అభివృద్ధి పనుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తే ముఖ్యమంత్రి రాడు అని కిషన్‌ రెడ్డి విమర్శిస్తూ.. . జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ల అభివృద్ది, వందే భారత్‌ ట్రైన్ల ప్రారంభం, 800 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే … ముఖ్యమంత్రి ఫాంహౌస్‌ లో కూర్చుంటున్నడు అని దుయ్యబట్టారు
కల్వకుంట్ల కుటుంబానికి పూర్తిగా అధికారం తలకెక్కి అహంకార మదంతో ప్రధానిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చలేదు..అని కిషన్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీపై ప్రధాని మోదీ ఏనాడు హామీ ఇవ్వలేదు.. రెండోసారి ముఖ్యమంత్రి అయితే బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి మాట తప్పింది ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల దిష్టిబొమ్మలు తగులబెట్టాలి..బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజుబుల్టి కాదు.. గతంలో కేంద్రం చెప్పింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం..అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని కేసీఆర్‌, కేటీఆర్‌ ఏర్పాటు చేస్తామంటూ మాటలు చెప్పారు.. ఇప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం ఎందుకు నిర్మించడం లేదు అంటున్నారని తెలిపారు.
కేసీఆర్‌ మాటలు కోటలు దాటుతాయి… పనులు మాత్రం ఫాంహౌస్‌ దాటవు..కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు. మన నీళ్లు-మన కొలువులు మనకేననే ఉద్యమ నినాదంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నరు..కేసీఆర్‌ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు.
ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ..
కృష్ణా వాటర్‌ ట్రిబ్యునల్‌ కు సంబంధించి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయిపోయి, పొలాలు సశ్యశ్యామలమైనట్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగరంలో హోర్డింగులతో ప్రచారాలు చేసుకుంటోంది..రూ. 35 వేల కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం వల్ల రూ. 50 వేల కోట్లకు అంచనా వ్యయం పెరిగి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్ల ప్రజలపై భారం పడుతోందన్నారు. అక్టోబరు 10 వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణకు రానున్నారు. ఆదిలాబాద్‌ లో జరిగే బిజెపి బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *