బిఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చాం
డాక్టర్లు నార్మల్ డెలివరి దిశగా అడుగులు వేయాలె…
రామకృష్ణ మఠం సమాజ హితంకు చేస్తున్న పనులు అభినందనీయం
గర్భిణీ స్త్రీలకు శిక్షణ`అవగాహనలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 29 : గర్భిణీ స్త్రీలందరూ కూడా భగవద్గీత చదివి మంచి అలవాట్లు చేసుకుంటే వారి పిల్లలు కూడా మంచి అలవాట్లతో పుడతారని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు గర్భిణీ స్త్రీలకు సూచించారు. సోమవారం సిద్ధిపేటలోని విపంచి ఆడిటోరియంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన గర్భిణీ స్త్రీలకు శిక్షణ-అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ…అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం అని, అమ్మ అంటే చాలా శక్తివంతమైనటువంటిదని, ఆ అమ్మకు మరింత అర్థాన్నిచ్చే విధంగా..ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమన్నారు. రామకృష్ణ మఠం ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందనీయమనీ, కార్యక్రమం గర్భిణులకోసమైనా, తాను కూడా వొచ్చి కూర్చుని జాగ్రత్తగా విన్నానని అన్నారు. అంటే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, ఆ తల్లి ఎలాంటి స్థితిగతుల్లో..ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తూ ఉందనేది పుట్టబోయే బిడ్డ మీద ప్రభావాన్ని, బిడ్డ జీవితాన్ని నిర్ణయిస్తుందన్నారు. తన బిడ్డ తన కంటే అందంగా ఉండాలని, ఉన్నతంగా ఉండాలని, హుషారుగా గొప్ప అద్భుతమైన జీవితాన్ని పొందాలని ఆశిస్తూ దానికి కష్టపడడానికి సిద్ధపడుతుందని అన్నారు. కానీ ఆ తల్లి కష్టపడడం అంటే పుట్టబోయే బిడ్డను కష్టపెట్టడం, పుట్టబోయే బిడ్డ జీవితంతో మనం ఆడుకోవడమేనని, కరెక్ట్‌గా చెప్పాలంటే పుట్టబోయే బిడ్డను కష్టపెట్టడమేనన్నారు. మెదడు బాగా వృద్ధి చెందుతేనే కదా శిశువు హుషారుగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.
తల్లి ప్రభావం..తండ్రి ప్రభావం..కుటుంబం ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉంటుందని, కనుక ఆ తల్లికి శారీరక మానసికమైన, మానసికమైన ప్రశాంతత కావాలని, పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. మానసికంగా బాగుండాలంటే ఇంట్లో రోజు గొడవలు, అత్త మామలతో గొడవలు, భర్తతో గొడవలు ఉండకూడదని హరీష్ రావు అన్నారు. పని వొత్తిడి, ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగం చేసే దగ్గర సహచర ఉద్యోగులతో గానీ, బాస్‌తో గానీ ఉండే ఇబ్బంది కావొచ్చన్నారు. గ్రామాల్లో ఉండే పేద మహిళలు వ్యవసాయ పనులకు కూలీలకు వెళ్లడం, లేదా తమ వృత్తిని కొనసాగించే క్రమంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అందుకే సెంగా ఉన్నప్పుడు కెసిఆర్ గర్భం ఉన్న సమయంలో గర్భిణులు పనులకు వెళ్లొద్దని, ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండాలనే ఉద్దేశంతోనే వారికి ఆర్థికంగా చేయూతనిచ్చారన్నారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని డబ్బులు ఇచ్చాడన్నారు. వాళ్లు ఉద్యోగం కోసం వెళ్లకపోతే ఇంటి దగ్గర ఇల్లు గడవని పరిస్థితి అని, అలాంటి గర్భంతో ఉన్న తల్లి పనికి పోవడం వల్ల వొత్తిడికి లోనైపోయి ఆ పుట్టబోయే పిల్లల ఎదుగుదల మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్పి వారి కోసం వివిధ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. భార్య ఆరోగ్యంగా ఉండగలిగితే, ప్రశాంతంగా ఉండగలిగితే పుట్టబోయే బిడ్డ కూడా ప్రశాంతమైన జీవితాన్ని పొందగలరని, తల్లిదండ్రుల మీద కూడా ఈ బాధ్యత ఉంటుందన్నారు.
హిందువులు అయితే భగవద్గీత చదవాలని…వినాలని…మంచి పుస్తకాలు చదవాలని..తల్లులు చదివితే పిల్లలు కూడా అట్లాంటి మనస్తతవంతో పుడతారని అన్నారు. గర్భంలో ఉన్న తొమ్మిది నెలలు తల్లుల నడవడిక మీద పిలల్ల నడవడి ఆధారపడుతుందన్నారు. తల్లుఉ పూజలు చేస్తే, భవద్గీత, మంచి సంగీతం వింటే, మంచి పుస్తకాలు చదివితే అవే అలవాట్లు పుట్టబోయే పిల్లలకు వొస్తాయన్నారు. నార్మల్ డెలివరీలో పుట్టే పిల్లలు చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఆ వియంపై తల్లికి, భర్తకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. నార్మల్ డెలివరీ చేయడంలో డాక్టర్లకు, సిబ్బందికి పని ఎక్కువ ఉంటది అన్నారు. మొదటి గంట తల్లి పాలు అమృతంతో సమానమని, జీవితంలో వాటి వల్ల దొరికే పోషకాలు పిల్లలకు ఆ మొదటి గంటలోనే దొరుకుతాయనీ, ఎంత మంచి ఆహార పదార్థాలు ఎన్ని తినిపించినా వాటికి సమానం కాదన్నారు. అందుకే ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తెస్తాయని, అందుకే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరగాలన్నారు. ముఖ్యంగా అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బంది దీంట్లో ఎంత ట్రైన్ అయితే అంత మంచిగా ఉంటారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చాలా ప్రయత్నాలు చేశామనీ, అంగన్వాడీలు ఆరోగ్యలక్ష్మి అనే కార్యక్రమం పెట్టి పాలు, కోడిగుడ్డుతో అన్నం పెట్టించే కార్యక్రమం తెచ్చినట్లు గుర్తు చేశారు. కడుపులో బిడ్డ పడగానే మీకు ఐరన్ సిరప్లు, బెల్లం పట్టీలు వంటివి కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టామన్నారు. తాము అందరికీ అందించే ప్రయత్నం చేశామని, బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్ ఇచ్చామన్నారు.





