‌గద్వాల జిల్లాకు సీఎం కేసీఆర్‌ ‌వరాల జల్లు

పంచాయితీలకు 10 లక్షల చొప్పున గ్రాంట్‌
అం‌దుబాటులోకి గద్వాల కలెక్టరేట్‌,ఎస్పీ కార్యాలయం
మంత్రులతో కలసి ప్రారంభించిన
సిఎం కెసిఆర్‌
‌గద్వాల బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయానికి కూడా ప్రారంభం

జోగులాంబ గద్వాల,ప్రజాతంత్ర, జూన్‌12: ‌జోగులాంబ గద్వాల జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మండల కేంద్రాలకు, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్‌ ‌ప్రకటించారు. గద్వాల జిల్లాలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీసు, కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అయిజ రోడ్డులో ఏర్పటు చేసిన బీఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభలో కేసీఆర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. ద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు.. 12 మండలాలు.. నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని కేసీఆర్‌ ‌తెలిపారు. ఇది వరకు ఇక్కడకు రాలేదు.. తొలిసారి వచ్చిన కాబట్టి.. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రూ. 10 లక్షల చొప్పున ప్రత్యేక గ్రాంట్‌ ‌మంజూరు చేస్తున్నాం. దాంతో బాగా చేసుకోవాలని కోరుతున్నాను. మండల కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రతి మండల కేంద్రానికి రూ. 15 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాను. గద్వాల మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు, మిగిలిన మూడు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాను. ఈ నిధులతో మున్సిపాలిటీలు బాగుపడాలి. అద్భుతమైన పనులు జరగాలి. ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాటన్నింటిని మనం సాధించుకుందాం. గట్టు ఎత్తిపోతల పథకాన్ని, అలంపూర్‌లో ఆర్డీఎస్‌కు కొనసాగింపుగా ఉన్న మల్లమ్మ కుంట పథకాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని మనవి చేస్తున్నాను అని కేసీఆర్‌ ‌తన ప్రసంగాన్ని ముగించారు.
అందుబాటులోకి గద్వాల కలెక్టరేట్‌,ఎస్పీ కార్యాలయం
జోగులాంబ గద్వాల,ప్రజాతంత్ర, జూన్‌12: ‌గద్వాల జిల్లా కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి.. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ ‌వల్లూరి క్రాంతిని కూర్చోబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్‌ ‌శాంతికుమారి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ‌మహ్మూద్‌ అలీ,ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.జిల్లా కేంద్రాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జోగులాంబ గద్వాల జిల్లాలలో సకల సదుపాయాలతో సకృత కలెక్టరేట్‌ను నిర్మించింది. కలెక్టరేట్‌ ‌భవనాన్ని రూ.51.18 కోట్లతో మూడు అంతస్తుల్లో నిర్మించింది. వివిధ శాఖలకు చెందిన 36 జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేశారు.

సకృత కలెక్టరేట్‌ ‌కార్యాలయం 1.39 లక్షల చదరపు టర్లలో 46 గదులతో ఏర్పాటైంది. కలెక్టర్‌ ‌చాంబర్‌తోపాటు అదనపు కలెక్టర్ల చాంబర్లు, వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌తో పాటు విశ్రాంతి హాల్‌ ‌నిర్మించారు. మొదటి, రెండో అంతస్తులో జిల్లా అధికారుల కార్యాలయాలు, సపంలోనే ముఖ్య అధికారులు ఉండేలా ఎనిమిది నివాస భవనాలు నిర్మించారు. కార్యాలయ ఆవరణలోని గార్డెనింగ్‌, ‌కాకతీయుల కాలం నాటి స్తంభాలను కలెక్టరేట్‌ ‌ముందు భాగంలో నిర్మించడంతో కలెక్టరేట్‌ ‌ప్రత్యేక శోభ సంతరించుకున్నది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్‌ ‌ప్రధాన కార్యాలయానికి కూడా  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. మొదట కార్యాలయానికి చేరుకున్న సీఎంకు హోంమంత్రి మహమూద్‌ అలీ, పోలీస్‌ ‌హౌసింగ్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌కోలేటి దామోదర్‌, ‌డీజీపీ అంజనీకుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎంకు పోలీస్‌ ‌సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయ శిలాఫలకా న్ని ప్రారంభించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్పీ చాంబర్‌లో జిల్లా పోలీస్‌ అధికారి సృజనను కూర్చోబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల జిల్లా పోలీస్‌ ‌కార్యాలయ సముదాయాన్ని ప్రభుత్వం రూ.38.50 కోట్లతో నిర్మించింది. కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వహించేందుకు నాలుగు ఫోర్లు, 45 గదులు, సక్ష సమావేశాల కోసం కాన్ఫరెన్స్‌హాల్‌, ‌ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేశారు. సాయుధ దళపతి కార్యాలయంతోపాటు ఆర్మ్‌డ్‌ ‌సిబ్బంది ఉండేలా రెండు బరాక్‌లు నిర్మించారు. ల్యాబ్‌ ‌సౌకర్యం, ఫోరెన్సిక్‌, ‌సైబర్‌, ‌క్లూస్‌టీం కోసం సైతం వసతులు కల్పించారు.

డాగ్‌, ‌బాంబ్‌ ‌స్కాడ్‌ ‌సిబ్బందికి వసతి కూడా ఏర్పాట్లు చేశారు. ఇకపోతే  జిల్లా బీఆర్‌ఎస్‌ ‌పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సోమవారం సాయంత్రం ప్రారంభించారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పండితుల వేద మంత్రోచ్ఛరణాల మధ్య శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్‌ ‌కట్‌ ‌చేసి పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్‌ ‌ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్వాల్‌ ‌జిల్లా పార్టీ ఇంచార్జి బండ్ల కృష్ణమోహన్‌ ‌రెడ్డిని సిఎం కెసిఆర్‌ ‌కుర్చీలో కూర్చోబెట్టారు.  కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ ‌రెడ్డి, అంబ్రహం, ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి, అంజయ్య యాదవ్‌, ‌శాట్స్ ‌చైర్మన్‌ ఆం‌జనేయులు గౌడ్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సిఎం రాకతో జిల్లాలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *