గత ప్రభుత్వ హయాంలో సర్వనాశనం

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి

మహబూబాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8:గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల రaాన్సీ- రాజేందర్‌ రెడ్డి స్కిల్‌డెవలప్‌మెంట్‌ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. అనుమాండ్ల రaాన్సీ – రాజేందర్‌ దంపతులు సొంత డబ్బులతో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అధికారం అడ్డంపెట్టుకుని ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాలకుర్తిలో అరాచకాలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎవరూ ఎవరికీ భయపడొద్దని.. మళ్లీ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడే ఆ పార్టీ పని అయిపోయిందన్నారు.

కేసీఆర్‌ రిటైర్డ్‌ అవుతాడుకుంటే కాలు జారి కిందపడ్డారన్నారు. కేసీఆర్‌ తిన్న లక్ష కోట్ల డబ్బును కక్కిస్తామన్నారు. ఎర్రబెల్లి దయాకరరావు ఐదు వందల కోట్ల అవినీతికి పాల్టడ్డారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకరరావు తరను ఓడిరచేందుకు మునుగోడులో ప్రచారం చేశారని.. అందుకే కావాలనే ఇవాళ పాలకుర్తిలో అడుగుపెట్టానని ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీ నాయక్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రాంచందర్‌ నాయక్‌, వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *