గణపతి బప్పా మోరియా

వినాయక చవితి ఆరభంతో వీది వీదిన
గణపతి మండపాలు విద్యుత్‌ ‌కాంతులతో
సర్వ సుందరంగా ముస్తాబై పచ్చతోరణాలతో
భక్తులకు స్వాగతం పలికి దర్శనమిచ్చే…

నవ రాత్రులు భక్తి శ్రద్ధలతో కొలిచేరు
ఉపవాస, జాగరాలతో కోరికలు కోరేరు
ప్రజలంతా సంధ్యవేళ అమ్మలక్కలందరూ
కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించెదరు
పొద్దున్నే సుప్రభాతాలతో నిద్ర లేచేరు జనాలు

యువత సంబరాల్లో మునిగి సంతోషంతో
భక్తి పారనశ్యమై భజనలతో  జాగారం
చివరి రోజున ఊరేగింపుగా బయలుదేరి
బాణా సంచా, రంగులు, డీజే చప్పులతో
వాడ వాడలా తిరుగుతూ నిమర్జనానికి
వెళ్తూ గణపతి బప్పా మోరియా నినాదాలతో
ఒక వైపు సంతోషం, మరో వైపు భాదతో
వినాయకున్ని సాగనంపుతారు గంగమ్మ ఒడికి…….

 – మిద్దె సురేష్‌, ‌కవి వ్యాసకర్త
  9701209355 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *