గంగాధర స్టేషన్‌లో పేలుడు ఉలిక్కిపడ్డ పరిసర ప్రాంత ప్రజలు

చిత్తూరు, అక్టోబర్‌ 8 : ‌చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌స్టేషన్‌ ‌లో భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఉలిక్కి పడ్డ పరిసర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాలుగు సంవత్సరాల క్రితం తనిఖీల్లో భాగంగా కారులో లభించిన గన్‌ ‌పౌడర్‌ను, కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌ ఆవరణలో నిల్వఉంచారు.

ఇవాళ ఒక్కసారిగా కారులో పేలుడు సంభవించి కారు అద్దాలు,స్టేషన్‌లోని అద్దాలు పగిలి గాజు పెంకులు ఎగిరిపడ్డాయి. ఈ సమయంలో పోలీసు సిబ్బంది గదిలో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఎస్పీ స్పందిస్తూ పీఎస్‌ ‌వెనుక ఉన్న మర్రిచెట్టు కింది భాగంలో నిల్వ ఉంచిన గన్‌పౌడర్‌ను పూడ్చిపెట్టగా ఒత్తిడి కారణంగా చిన్నపాటి పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో ప్రజలు, పోలీస్‌ ‌సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *