నమ్మించి గొంతు కోయడం
నీ వారసత్వ లక్షణమేమో
అందుకే
శాంతి మంత్రం జపిస్తూనే
విద్రోహ తంత్రం రచిస్తావు
మెత్తగా హత్తుకుంటూనే
విచ్చు కత్తులు దూస్తావు
నెయ్యానికి స్వాగతిస్తూనే
కయ్యానికి తెగబడతావు
చర్చలకు చేయి చాస్తూనే
దుశ్చర్యకు ఒడిగడతావు
చీకటి మూకలు ఎగదోసి
దొంగవేటుకు పూనుతావు
విరమణను ప్రకటిస్తూనే
సరిహద్దుల అతిక్రమిస్తావు
సత్తువను తక్కువని తలిస్తే
సత్తెనాశనానికి సత్యచిహ్నం
ఓపికను భయమని భావిస్తే
నీ మూర?త్వానికి తార్కాణం
ఓయి చైనా భూతమా !
స్నేహానికి సర్వస్వం అర్పిస్తాం
ద్రోహనికి ప్రాణాలు కబలిస్తాం
ఇది భారత జాతి గొప్పతనం
ఐనా ఎన్నిమార్లు తరిమినా
నీ తీరు మారలేదు సరికదా!
పైపెచ్చు హెచ్చుమీరు వైనం
కలహలమారి డ్రాగన్ ఇక
కవ్వింపు చర్యలు మానుకో
హద్దుమీరు తీరు మరిచిపో
స్థాయి గురుతెరిగి మసలుకో
కాదంటే గుణపాఠం తప్పదు
(చైనా దుశ్చర్యలకు హెచ్చరికగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493




