రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చి వారిని తగు రీతిగా గౌరవం ఇస్తున్నారు ఇందుకు నిదర్శనం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ఇది చాలా గొప్ప నిర్ణయం మహిళా సాధికారత సాధనలో భాగంగా రవీంద్రనాథ్ఠాగూర్ సూచన మేరకు మహిళల విద్య కోసం ప్రత్యేకంగా 1924లో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నాంపల్లి గోల్డెన్ త్రెషోల్డ్ భవనంలోని బాలికల పాఠశాల ప్రాంగణంలో పీయూసీ హ్యుమానిటీస్ కోర్సులతో ప్రారంభించినారు తర్వాత 1950లో కోఠిలోని ప్రస్తుత భవనములోనికి మార్చినారు. 1803లో కోఠిలో నిర్మించిన బ్రిటిష్ రెసిడెన్సీ అంతర్భాగంగా ఈ కాలేజీని నడిపినారు.220 ఏండ్ల నాటి బ్రిటిష్ రెసిడెన్సీ భవనం ఈ విశ్వవిద్యాలయానికి ప్రధాన ఆకర్షణ. గత ప్రభుత్వం ఈ కాలేజీని రాష్ట్రంలో తొలి తెలంగాణ మహిళా యూనివర్సిటీగా మార్చినది. మహిళల కోసం ఉన్న కాలేజీని విశ్వవిద్యాలయంగా మార్చడం హర్షించదగిన విషయం. తెలంగాణలో మహిళలు బతుకమ్మను పూలతో అలంకరించి ప్రకృతిని ఆరాధించే పండుగ.
తెలంగాణ ప్రకృతితో ముడిపడిన ప్రాంతం ఇది ప్రపంచంలో ఏక్కడ కూడా లేదు. ఇది కేవలం మహిళల ఆడుకునే ప్రత్యేకమైన పండుగ మరియు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా ఆనందదాయకముగా జరుపుకుంటారు. తెలంగాణలో ఆడపిల్లను ముద్దుగా బతుకమ్మ అని కూడా పిలుస్తుంటారు. ఈ విశ్వవిద్యాలయం కేవలం మహిళల కోసమే నిర్వహిస్తున్నందున తెలంగాణ బతుకమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఏ సంస్థకు ఏ భవనానికి కూడా ఇంతవరకు బతుకమ్మ పేరు పెట్టలేదు. బతుకమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం గావించుటకు విద్యావేత్తలు మేధావులు ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు తోడ్పడతారని కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుకూలంగా వెనువెంటనే తగిన ఆదేశాలు జారీ చేస్తారని ఆశిస్తున్నాను.
-దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్
సింగరేణిభవన్ హైదరాబాద్. 9849592958





