ఉద్విగ్నభరిత క్షణాల మధ్య చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చిన పూజారులు
అమ్మవారి రాకకు సూచనగా గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపిన ములుగు ఎస్పీ శబరీష్
చిలుకల గుట్ట వద్ద అమ్మవారికి అధికారికంగా ఘనస్వాగతం పలికిన మంత్రి సీతక్క, అధికారులు
జనసంద్రంగా మారిన జంపన్నవాగు, జాతర ప్రాంగణం
గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు
తల్లుల దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిపోయిన క్యూలైన్లు
గద్దెల ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు
తనివితీరా తల్లులను దర్శించుకొని తరిస్తున్న భక్తజనం
మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : వన జాతరకు తరలివచ్చిన జనంతో మేడారం పరిసరాలు జన సంద్రాన్ని తలపించాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పిలువబడుతున్న మేడారం అటవీ ప్రాంతాలు భక్తుల జయ జయ ద్వానాలతో మారుమోగాయి. చిలుకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పూజారులు గద్దెలపైకి తీసుకురావడంతో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది భక్తిపారవశ్యంతో గిరిజన యువకుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంఛనాల మధ్య ఆదివాసీ పూజారులు, వడ్డెలు వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు. దీంతో చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు భక్తజనంతో కిటకిటలాడిరది. సమ్మక్కను తీసుకు వచ్చే మహా క్రతువు గురువారం సాయంత్రం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉద్విగ్నభరితంగా సాగింది.
ఉదయం నుంచి ప్రత్యేక పూజలు…
సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ఏర్పాట్లు గురువారం ఉదయమే మొదలయ్యాయి. వడ్డెలు, పూజారులు ఉదయం ఐదున్నర గంటలకే మేడారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి కంక వనాలు (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి కొత్త కుండలు తెచ్చి గద్దెలపైకి చేర్చారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై కి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం చిలకల గుట్టపైకి బయలుదేరారు.

అప్పటికే చిలకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది.
భక్తులు సమ్మక్క వచ్చే దారి పొడవునా రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నింపేశారు. సాయంత్రం 6.50 గంటల సమయంలో సమ్మక్క తల్లితో పూజారులు చిలుకల గుట్ట దిగడం ప్రారంభించారు. ఇది చూసి భక్తులు, శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాల ప్రకారం సమ్మక్కను ఆహ్వానిస్తూ ఆమె రాకకు సూచికగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఏకె 47 గన్ తో సాయంత్రం 6.51 గంటలకు గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ములుగు ఎమ్మెల్యే, పంచాయతీ రాజ్ ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ ,(సీతక్క) సమ్మక్క తల్లికి అధికారికంగా ఘన స్వాగతం పలికారు.

అడుగడుగునా మొక్కులు…
చిలుకల గుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లికి భక్తులు అడుగడుగునా మొక్కులు చెల్లిస్తూ నీరాజనం పట్టారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి సమ్మక్క తల్లి రాక కోసం రోజంతా ఎదురు చూశారు. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల మధ్య సమ్మక్క ప్రతి రూపాన్ని దర్శించి తన్మయత్వం పొందారు. సమ్మక్కను తీసుకు వస్తున్న బృందం ఎదుర్కోళ్ల పూజా మందిరం చేరుకోగా వడ్డెలు, పూజారులు ఎదురుకోళ్లు జరిపించారు. సమ్మక్కకు సెలపెయ్యను బలి ఇచ్చారు. మేడారం ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకువస్తున్న పూజారులకు స్వాగతం పలికారు. సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చినప్పటి నుంచి ప్రతిష్ఠించే వరకు గద్దెల ఆవరణలో విద్యుత్ దీపాలను ఆర్పి వేశారు. సంప్రదాయం ప్రకారం రహస్య పూజలు చేసిన అనంతరం రాత్రి ….. సమయంలో దీపాలను వెలిగించారు. దీంతో మేడారం మహా జాతరలో ప్రధాన ఘట్టం పూర్తయింది.

నేడు జాతర..
మేడారం గద్దెలకు బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు , గోవిందరాజులు రాగా%ౌౌ% గురువారం సమ్మక్క తల్లిని ప్రతిష్టించారు. దీంతో మేడారంలో మహా జాతర ప్రారంభమైంది. ఇక సమ్మక్క తల్లి కూడా గద్దెపై కొలువుదీరడంతో శుక్రవారం లక్షలాదిగా తరలివచ్చే భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇప్పటికే కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం వనదేవతలు ఫిబ్రవరి 24న వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. మరో వారం పాటు తిరుగువారం జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్ అదనపు కలెక్టర్ శ్రీజల ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.