పాతకు వీడ్కోలు
కొత్తకు స్వాగతం
హ్యాపి న్యూ ఇయర్…
చీర్స్అటూ బీర్లు. చికెన్
హాయిరే అంటూ క్యాబరే డ్యాన్యులతో
సంబరాలు జరుపుకునే పాలకుల పండుగ …!
గతాన్ని తలుచుకుంటే
గుండె తరుక్కుపోతుంది.
నిర్బందాలు. నిషేదాలు. కూంబింగ్ ఆపరేషన్స్
రక్తపు టేరుల్లో పల్లె కమురు వాసనలో
రాజ్య ప్రేరేపిత హంతక ముఠా స్వైర విహారంలో
ప్రజాస్వామ్యం హత్య
చేయబడింది
సర్వం విద్వంసం కొనసాగిస్తూ
అబివృద్ది జపం చేస్తుండు
అడవులు పల్లెలు పట్టణాలు తల్లడిల్లుతున్నాయి !
కాశ్మీర్ నుండి కన్యాకుమారి
గుజరాత్ నుండిఅస్సాంవరకు
పాలకులు హత్య చేయని రోజు లేదు
ఏయ్ పాలకులారా ! ఖబద్దార్
తూర్పున ఉదయించే
సూర్యున్ని ఆపడం
ఎవడి తరం ?
దేశాలు స్వతంత్య్రాన్ని
జాతూలు విముక్తిని కోరుతున్నాయి !
కార్మికలోకం మరో ప్రపంచంకై
కదనరంగానికై సిద్ధ
మౌతున్నది !
నిన్నటి రోత సమాజాన్ని పాతరేద్దాం !
రేపటి సమత రాజ్యాన్ని ఆహ్వానిద్దాం !
ఇది పీడిత ప్రజల కొత్త
సంవత్సర శుభాకాంక్షలు …..!!
శోభ రమేష్
8978656327





