కేసీఆర్‌ ‌వొచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందని వ్యక్తి లేడు
కాంగ్రెస్‌ అం‌టేనే అతుకుల బొంత…మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌..
‌మన చంటి లోకల్‌…‌మంచి మెజార్టీతో గెలిపించాలి
ఆందోల్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌బూత్‌ ‌స్థాయి ఇంచార్జ్ ‌ల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు

ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : ‌సీఎం అభ్యర్థులు 32 మంది కాంగ్రెస్‌ ‌లో వున్నరు. అయితే అలుగుడు లేదంటే గులుగుడు వాళ్లది అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మంగళవారం  సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ ‌నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ‌బూత్‌ ‌స్థాయి ఇంచార్జ్ ‌ల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ… ఇంత మంచి ప్రభుత్వం ఉండగా రిస్క్ ఎం‌దుకు. 11 సార్లు ఓట్లు వేస్తే కాంగ్రెస్‌ ‌నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్‌ ఇవ్వలేదు, సంగారెడ్డి జిల్లా కూడా చేయలేదు. రైతు బంధు ఇవ్వలేదు.  మనది ఆల్రెడీ ప్రూవ్‌ అయిన పార్టీ. మన పార్టీ ఉండగా కాంగ్రెస్‌ ఎం‌దుకు. రిస్క్ ఎం‌దుకు అని పేర్కొన్నారు.  కర్ణాటక నుండి శివకుమార్‌ ‌వచ్చి అక్కడ 5 గంటల కరెంట్‌ ఇస్తున్నట్లు ఒప్పుకున్నడు. మన నెత్తి మీద పాలు పోసిండు. కూర్చున్న కొమ్మను నరికితే ఇబ్బంది పడతాం. చిన్న పొరపాట్లు ఉంటే సవరించుకోవాలి. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగల బెట్టుకోవద్దు. కేసీఆర్‌ ‌సిఎంగా ఉండాలంటే ఇక్కడ గులాబీ జెండా ఎగరాలి. పండిన మొత్తం పంటను గింజ లేకుండా ఊరూరా కాంటా పెట్టీ కొనుగొలు చేస్తున్నారు. రైతు బంధు రామ్‌ ‌రామ్‌.. ‌కరెంట్‌ ‌జై భీమ్‌.. ‌పంట కొనుగోలు బంద్‌ అవ్వుద్ది. కేసీఆర్‌ ‌వచ్చాక రైతు విలువ పెరిగింది.

రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. ప్రభుత్వం ఎంతో మందికి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నది. ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బలంగా చెప్పాలి. ప్రభుత్వ పథకం అందుకొని ఇల్లు లేదు, లబ్ధి పొందనీ వ్యక్తి లేడు. 400 లకే గ్యాస్‌ ‌సిలిండర్‌ ఇవ్వబోతున్నాం.  అందరికీ పాత బియ్యం సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. పింఛన్లు పెంచుకోబోతున్నాం. 5లక్షల బీమా ఇవ్వబోతున్నాం. అసైన్డ్ ‌భూములకు పట్టా ఇవ్వబోతున్నాం. మనది మంచి మేనిఫెస్టో. ప్రజల్లోకి వెళ్ళాలి. నమ్మితే నట్టేట మునుగుతాం. కర్ణాటక పరిస్థితి వస్తుంది. మెదక్‌ ‌జిల్లాలో మొత్తం 10 స్థానాలు గెలవాలి అన్నది నా పట్టుదల. నిండు మనసుతో పని చేయాలి. ఇది తెలంగాణ భవిష్యత్తు. ఇక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థి అనుకున్న వ్యక్తి అలిగిండు. ఎందుకు? కాంగ్రెస్‌ అం‌టేనే అతుకుల బొంత. మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌. ‌సీదా సీదా. మన చంటి లోకల్‌. ‌మనకు అందుబాటులో ఉంటారు. మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *