క్యాన్సర్ మూడోదశకు చేరితే ఎంత డేంజరో…
కేసీఆర్ 3వ సారి సీఎం అయితే అంతకంటే డేంజర్
నట్టేట ముంచిన బీఆర్‌ఎస్ కు ఓటేస్తారా?
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కమార్
చేవెళ్ల,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళంలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘కేసీఆర్ కేన్సర్ లాంటోడు… మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేసిండు.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు. మూడోసారి వస్తే ఇక అంతే.. క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో… కేసీఆర్ సీఎం అయితే అంతకంటే డేంజర్… ప్రజలారా ఆలోచించండి…’’అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దంతా పెగ్గుల భాగోతమే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను చూస్తే దండు పాళ్యం ముఠా గుర్తుకొస్తుందన్నారు.
అధికారమిస్తే నట్టేట ముంచిన బీఆర్‌ఎస్ కావాలా? ప్రజల పక్షాన నిత్యం ఉద్యమాలు చేస్తూ జైలుకు వెళ్లేందుకు వెనుకాడని బీజేపీ కావాలా? తేల్చుకోవాలని కోరారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కర్నాటక ఎమ్మెల్యే చంద్రప్ప, రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, రాష్ట్ర నాయకులు అశ్వధ్దామరెడ్డి. కంజర్ల ప్రకాశ్, జంగారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, శ్రీకాంత్ రెడ్డి, నరేందరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
కార్యకర్తలు భారీగా హాజరైన ఈ సమ్మేళనంలో వారిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. జితేందర్ రెడ్డిది లక్కీ హ్యాండ్. అందుకే ఎస్సీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతలు ఆయనకు అప్పగించినం. ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీలే అధికారంలోకి వచ్చాయి. కాబట్టి తొలుత కాషాయ జెండా ఎగరేసే సీటు చేవెళ్లనే..అని బండి సంజయ్ అన్నారు.బీసీలంతా బీజేపీ మా పార్టీ అని భావిస్తున్నరు కాబట్టే… ఎమ్మెల్యే టిక్కెట్లలో కేసీఆర్ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిండు… బీసీలారా ఆలోచించండి….52 శాతం బీసీలున్న రాష్ట్రంలో 22 సీట్లు మాత్రమే ఇచ్చిన బీఆర్‌ఎస్ కావాలా? బీసీనే ఏకంగా ప్రధానమంత్రిని చేయడంతోపాటు ఏకంగా 27 మంది బీసీలను కేంద్ర మంత్రులుగా బీజేపీ కావాలా? అని ప్రశ్నించారు.




