కెసిఆర్‌తో అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌భేటీ

తాజా రాజకీయాలపై రెండు గంటలపాటు చర్చ

న్యూ దిల్లీ, జూలై 29 : తన దిల్లీ పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్‌ ‌శుక్రవారం సమాజ్‌ ‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌తో భేటీ ఆయ్యారు. బాబాయ్‌ ‌శివపాల్‌ ‌యాదవ్‌తో కలిసి అఖిలేష్‌  ‌కేసీఆర్‌ ‌నివాసానికి చేరుకున్నారు. ఇరువురు నేతలకు ముఖ్యమంత్రి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌, అఖిలేష్‌  ‌సమావేశం దాదాపు2 గంటల పాటు కొనసాగింది. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై ముగ్గురు నేతలు చర్చించినట్లు తెలుస్తుంది.

కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ ‌చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పలువురు విపక్ష నేతలతో భేటీ అవుతున్నారు. గతంలో దిల్లీ పర్యటన సందర్భంగా పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులతో భేటీ అయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో దిల్లీ పర్యటనను మధ్యలోనే ముగించుకుని హైదరాబాద్‌ ‌వొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *