- ఇంగ్లీష్ అనువాదం ‘The Speaking Constitution’ ఆవిష్కరించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్
- మానవ హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కన్నబిరాన్
- పౌర సమాజానికి ఆదర్శం..: వక్తలు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : మానవ
హక్కులకై ఆఖరి వరకు పోరాడిన శక్తి కెజి.కన్నభిరాన్ అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ అన్నారు. శనివారం హక్కుల వకీల్ కెజి కన్నబిరాన్ ’24 గంటలు’ పుస్తకం ఇంగ్లీష్ అనువాదం ఆవిష్కరణ కార్యక్రమం ప్రజాతంత్ర దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అజయ్ అధ్యక్షతన శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ‘ప్రజాతంత్ర’ 2007-2008 సం.లలో 100 వారాలు ప్రచురించిన ‘వీక్షణం’ సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అక్షరీకరించిన కెజీ కన్నబిరాన్ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ’24 గంటలు’ కల్పనా కన్నబిరాన్ ఇంగ్లిష్ లో అనువదించగా ‘ది స్పీకింగ్ కాన్సిట్యూషన్’ పేరుతో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ‘హార్పర్ కాలిన్స్’ ప్రచురించిన పుస్తకాన్ని దేవులపల్లి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో ‘ప్రజాతంత్ర’ ప్రచురణకర్త సమన్వయ కర్తగా ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నిఖిలేశ్వర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సభలో ఇంగ్లీష్ పుస్తక అనువాద కర్త, ఎడిటర్ కల్పన కన్నబిరాన్ తమ అనుభవాలను వ్యక్తపరచారు. ఈ కార్యక్రమంలో వక్తలు ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ జి.హరగోపాల్, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ తదితరులు పాల్గొని కన్నాబిరాన్ తో తమకున్న అనుభవాలను ఈ వేదికలో పంచుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రజాతంత్ర వ్యవస్థాపక సంపాదకులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ దేవులపల్లి అమర్, టీజెఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, పత్రికా సంపాదకులు, పౌర హక్కుల కార్యర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




