కారు చీకట్లో కి కరెంటు సంస్థలు

తెలంగాణ ఆవిర్భవించే నాటికి ఇక్కడి పల్లెలు,పట్టణాలతో పాటు అన్ని రంగాల్లో కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.పరిస్ధితులు మెరుగయ్యేంతవరకు నష్ట పోవడానికి కూడా తెలంగాణ రైతాంగం సిద్ద పడే పరిస్థితి.అయితే ఈ సంక్షోభం నుంచి తెలంగాణ వేగంగానే బయటపడగలిగింది.ప్రధాన కారణం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో నిర్మించిన నూతన విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించడంతో మిగులు ఏర్పడింది.ఈ పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేసి తమకు అనుకూలంగా మార్చుకోగలిగింది‌.2014 నుండి నేటి వరకు కరెంట్ నిరంతరాయంగా అందుతున్నప్పటికి ఈ విషయంలో ప్రభుత్వం చేసిన కృషి తెలంగాణ కు మేలు చేసిన దానికంటే భవిష్యత్ లో జరగపోయే అనేక దుష్పరిణామాలకు చోటు కల్పించింది.ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యుత్ విజయోత్సవం సందర్భంగా మొత్తం గా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది.
అల్లకల్లోలంలో విద్యుత్ రంగం
తెలంగాణ వచ్చే(2014) సమయానికి 7,778 మెగావాట్ల వినియోగ సామర్థ్యం తెలంగాణకు ఉండే. కానీ నేడు 17345 మెగావాట్లకు వినియోగ సామర్థ్యం చేరుకున్నది.కానీ సరాసరి 9000 మెగావాట్లుగా వినియోగ సామర్థ్యాన్ని గుర్తించవచ్చు.ఈ మేరకు రాష్ట్రంమే విద్యుత్తును ఉత్పత్తి చేయవలసి ఉండే.భూపాలపల్లి,సింగరేణి రెండు విద్యుత్ ప్రాజెక్టులను అప్పటికే ఉన్న ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసింది.కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండింటి విషయంలో 30% పనులను పూర్తి చేసినారు.మరో రెండు కొత్త ప్రాజెక్టులను భద్రాద్రి కొత్తగూడెం అదనపు యూనిట్ల ద్వారా మరో 1880 మెగావాట్ల విద్యుత్ ను ఈ రాష్ట్రం మాత్రం పూర్తి చేయగలిగింది. పులి చింతల 120 మెగావాట్లు,జూరాల 234 మెగావాట్లు, వినియోగంలోకి తెచ్చినప్పుటికి శ్రీశైలం విద్యుత్ కేంద్రం వరదలతో నష్టపోగా 1020 మెగావాట్ల కెటిపిఎస్ కాలం చెల్లిన విద్యుత్ కేంద్రం మూసివేయాల్సి వచ్చింది. ఇంకా దామరచర్ల లోని యాదాద్రి పవర్ ప్లాంట్ లు (4000 మెగావాట్లు) నత్త నడకన నడుస్తున్నది. ఇప్పటివరకు కేంద్రం రాష్ట్రం రెండు కలిపి  6682 మెగావాట్ల విద్యుత్ ని మాత్రమే ఇక్కడి థర్మల్ స్టేషన్లు ఉత్పత్తి చేస్తున్నాయి.2500 మెగావాట్ల లోపే జల విద్యుత్ సౌకర్యం కలదు.ఇంకా 200 మెగావాట్లలోపే సోలార్ సామర్ధ్యం కలదు. కానీ ప్రభుత్వ ప్రకటనలో 42 శాతం సోలార్ విద్యుత్ ఉన్నట్లుగా ప్రకటన లు చేస్తున్నారు.కనీసం సోలార్ లో మూడంకెల యూనిట్లు కూడా దాటక ముందే 8000 మెగావాట్లకు సోలార్ విద్యుత్తును తీసుకువెళ్లాలని వ్యూహం అనేక అక్రమాలకు తెరలేపడానికి సిద్ధంగా ఉంది. ఇంత కొరత  ఊబిలో ఉన్న విద్యుత్ రంగం మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణ ఎక్కడ రూపుదిద్దుకుందో చెప్పాలి.! 10 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు ఉత్తి మాట ఐంది నిజమే కధా..
విద్యుత్ కొనుగోలు -అక్రమాలు
వాస్తవ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటే సగానికి సగం కేంద్రం నుంచి మరియు పక్క రాష్ట్రాలలోని ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి కొనాల్సి వచ్చింది.ఒక్క ప్రైవేటు సంస్థల నుంచే మొత్తం తెలంగాణ వినియోగంలో 36 శాతం విద్యుత్
కొనుగోలు చేస్తుంది. సరైన వ్యూహం లేకపోవడం వల్ల మరియు కొనుగోళ్లలో అక్రమాల ఫలితంగా దాదాపుగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 43000 కోట్ల రూపాయల నష్టాల లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విద్యుత్ రంగం ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు. 27.20  లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు దాదాపు 17 1/2 లక్షల నగర పారిశ్రామిక కలెక్షన్లు తీవ్ర ప్రమాదం లోకి నెట్టివేయబడబోతున్నాయి…..నా4.39 పైసలు తక్కువ కాకుండా ఒక్కో యూనిట్ ను కొని దాదాపు 8 రూపాయల వరకు వినియోగదారుని మీద నెట్టి వేస్తున్నాయి. ఒకపక్క విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే మొదటి స్థానం అని(1110 మెగావాట్ల నుంచి 2012) ముఖ్యమంత్రి గారు గొప్పలు చెపుతున్నారు‌. మొత్తం మన వినియోగ సామర్థ్యం 18 వేల మెగావాట్లు మాత్రమే.తమిళనాడు 35 వేల మెగావాట్లు , కర్ణాటక 30 వేల మెగావాట్ల తో మన కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. తలసరి విద్యుత్  వినియోగానికి అందుబాటులో ఉన్న రాష్ట్రాలలో మనకంటే ఛత్తీస్గఢ్, బీహార్ ముందంజలో ఉన్నాయి.2014 లో 2281 కోట్ల రూపాయల నష్టాలతో ప్రారంభమైన విద్యుత్ సంస్థ 2023 నాటికి  50 వేల కోట్ల నష్టాలకు చేరుకోబోతోంది. ఆస్తుల కంటే అప్పులు 150 శాతం పెరగడం ఈ దుస్థితిని చూపిస్తుంది. ఎత్తి పోతల పథకాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 9268 కోట్లతో పాటు ప్రభుత్వ శాఖలు కూడా దాదాపు 21 వేల కోట్ల బకాయిలు పడ్డాయి. ముఖ్యమంత్రి గారి తనయుడి మున్సిపల్ శాఖ బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నాయి.8 వేల కోట్ల వరకు ఉచిత విద్యుత్ నేపధ్యంలో చెల్లించాల్సిన బకాయి అలాగే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 36 వేల కోట్లు వెచ్చించి విద్యుత్ పంపిణీ వ్యవస్థ ను ఆధునికరించే క్రమంలో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగింది. ఫలితంగానే విద్యుత్ పంపిణీ నష్టం తీవ్రంగా ఉంది.త్రీస్టార్ రేటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అందించాల్సిన ప్రభుత్వం నాసిరకమైన ట్రాన్స్ఫార్మర్స్ ఇస్తుండటంతో  ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది.ప్రభుత్వం ఈ నష్ఠాన్ని 11 నుంచి 16 శాతంగా చెప్పుతున్నప్పటికి ఇది 40 శాతం వరకు కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వినియోగ దారులపై పెనుభారం.
ఒకవైపు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామంటునే మరో వైపు రైతులు నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం సబ్సిడీ లో కోత విదించి మూడు డిడిలకు ఒక 25 హెచ్.పి ట్రాన్స్పార్మర్ మరియు ఒక పోల్ ఇచ్చి ట్రాన్స్ కో చేతులు దులుపుకోవడంతో అదనంగా కావాలిసిన విద్యుత్ స్థంబాలు వైర్ల పేరు మీద దీనితో అదనంగా రైతుకు సుమారు మరో లక్ష రూపాయల పెనుబారం నెత్తినపడుతుంది.దీనికి తోడు అవినీతి సరేసరి.!
డిస్కం లు ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్ట పోగా మరో వైపు స్లాబులుగా విభజించబడిన విద్యుత్ వినియోగంలో ₹ 1 నుంచి మొదలుకొని ₹ 9.5  వరకు ఒక్కో యూనిట్ కు  వసూలు చేస్తుంది.దీంతోపాటు ఏసిడి చార్జీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడుతుంది.పబ్లిక్ స్ధలాలలో ఉపయోగించే వీధి లైట్లకు పర్ యూనిట్ ₹ 7 నుండి ₹ 8 వరకు వసూలు చేస్తుంది.ఈ మొత్తాన్ని పూడ్చుకోవడానికి ERC(ఎలక్ట్రిసిటి రెగ్యూలేరటి కమిటీ)అడ్డం పెట్టుకొని 52 వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి గుంజుకునేందుకు నిర్ణయించుకుంది. ఈ.ఆర్.సి లలోను,డిస్కం లలోను తమ బంధువులను,,తాబేదార్లుకు ఛైర్మన్,లుగా,డైరెక్టర్ లుగా సభ్యులుగా నియమించుకొని ఇష్టారాజ్యంగా విద్యుత్ సంస్థలను విధ్వంసం చేస్తున్నారు.విద్యుత్ రంగంలో లక్షమందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పన కలగానే మిగిలిపోయింది.ఆర్టిజన్ల సమస్య పరిష్కారం కాకపోగా వారి జీవితాలు మరింత ప్రమాదంలోకి ఈ ప్రభుత్వం నెట్టివేస్తుంది.ఈ పరిస్థితులలోనే కేంద్ర విద్యుత్ సంస్కరణలు తెలంగాణ లో అమలు కాకుండా నిలిపివేసుకున్నప్పటికి భవిష్యత్ లో ఈ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవచ్చు.ఈ నేపథ్యంలో నే ప్రభుత్వం చెపుతున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టి విద్యుత్ సంస్ధలను కాపాడుకోకపోతే విద్యుత్ వెలుగులు మాయమై కారు చీకట్లు అలుముకోవడం తధ్యం.‌
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *