‘‘విద్యుత్ రంగంలో లక్షమందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పన కలగానే మిగిలిపోయింది. ఆర్టిజన్ల సమస్య పరిష్కారం కాకపోగా వారి జీవితాలు మరింత ప్రమాదంలోకి ఈ ప్రభుత్వం నెట్టివేస్తుంది.ఈ పరిస్థితులలోనే కేంద్ర విద్యుత్ సంస్కరణలు తెలంగాణ లో అమలు కాకుండా నిలిపివేసు కున్నప్పటికి భవిష్యత్ లో ఈ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవచ్చు.ఈ నేపథ్యంలో నే ప్రభుత్వం చెపుతున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టి విద్యుత్ సంస్ధలను కాపాడుకోకపోతే విద్యుత్ వెలుగులు మాయమై కారు చీకట్లు అలుముకోవడం తధ్యం.’’
అల్లకల్లోలంలో విద్యుత్ రంగం
తెలంగాణ వచ్చే(2014) సమయానికి 7,778 మెగావాట్ల వినియోగ సామర్థ్యం తెలంగాణకు ఉండే. కానీ నేడు 17345 మెగావాట్లకు వినియోగ సామర్థ్యం చేరుకున్నది. కానీ సరాసరి 9000 మెగావాట్లుగా వినియోగ సామర్థ్యాన్ని గుర్తించవచ్చు.ఈ మేరకు రాష్ట్రంమే విద్యుత్తును ఉత్పత్తి చేయవలసి ఉండే. భూపాలపల్లి, సింగరేణి రెండు విద్యుత్ ప్రాజెక్టులను అప్పటికే ఉన్న ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసింది.కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండింటి విషయంలో 30% పనులను పూర్తి చేసినారు.మరో రెండు కొత్త ప్రాజెక్టులను భద్రాద్రి కొత్తగూడెం అదనపు యూనిట్ల ద్వారా మరో 1880 మెగావాట్ల విద్యుత్ ను ఈ రాష్ట్రం మాత్రం పూర్తి చేయగలిగింది. పులి చింతల 120 మెగావాట్లు,జూరాల 234 మెగావాట్లు, వినియోగంలోకి తెచ్చినప్పుటికి శ్రీశైలం విద్యుత్ కేంద్రం వరదలతో నష్టపోగా 1020 మెగావాట్ల కెటిపిఎస్ కాలం చెల్లిన విద్యుత్ కేంద్రం మూసివేయాల్సి వచ్చింది.
విద్యుత్ కొనుగోలు -అక్రమాలు
వాస్తవ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటే సగానికి సగం కేంద్రం నుంచి మరియు పక్క రాష్ట్రాలలోని ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి కొనాల్సి వచ్చింది.ఒక్క ప్రైవేటు సంస్థల నుంచే మొత్తం తెలంగాణ వినియోగంలో 36 శాతం విద్యుత్ కొనుగోలు చేస్తుంది. సరైన వ్యూహం లేకపోవడం వల్ల మరియు కొనుగోళ్లలో అక్రమాల ఫలితంగా దాదాపుగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 43000 కోట్ల రూపాయల నష్టాల లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విద్యుత్ రంగం ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు. 27.20 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు దాదాపు 17 1/2 లక్షల నగర పారిశ్రామిక కలెక్షన్లు తీవ్ర ప్రమాదం లోకి నెట్టివేయబడబోతున్నాయి…..నా4.
వినియోగ దారులపై పెనుభారం.
ఒకవైపు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామంటునే మరో వైపు రైతులు నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం సబ్సిడీ లో కోత విదించి మూడు డిడిలకు ఒక 25 హెచ్.పి ట్రాన్స్పార్మర్ మరియు ఒక పోల్ ఇచ్చి ట్రాన్స్ కో చేతులు దులుపు కోవడంతో అదనంగా కావాలిసిన విద్యుత్ స్థంబాలు వైర్ల పేరు మీద దీనితో అదనంగా రైతుకు సుమారు మరో లక్ష రూపాయల పెనుబారం నెత్తినపడు తుంది.దీనికి తోడు అవినీతి సరేసరి.! డిస్కం లు ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్ట పోగా మరో వైపు స్లాబులుగా విభజించబడిన విద్యుత్ వినియోగంలో ? 1 నుంచి మొదలుకొని ? 9.5 వరకు ఒక్కో యూనిట్ కు వసూలు చేస్తుంది.దీంతోపాటు ఏసిడి చార్జీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడుతుంది.పబ్లిక్ స్ధలాలలో ఉపయోగించే వీధి లైట్లకు పర్ యూనిట్ ? 7 నుండి ? 8 వరకు వసూలు చేస్తుంది.ఈ మొత్తాన్ని పూడ్చుకోవడానికి జు=• (ఎలక్ట్రిసిటి రెగ్యూలేరటి కమిటీ) అడ్డం పెట్టుకొని 52 వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి గుంజుకునేందుకు నిర్ణయి ంచుకుంది. ఈ.ఆర్.సి లలోను,డిస్కం లలోను తమ బంధువులను, తాబేదార్లుకు ఛైర్మన్,లుగా,డైరెక్టర్ లుగా సభ్యులుగా నియమించుకొని ఇష్టారాజ్యంగా విద్యుత్ సంస్థలను విధ్వంసం చేస్తున్నారు.విద్యుత్ రంగంలో లక్షమందికి ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పన కలగానే మిగిలిపోయింది. ఆర్టిజన్ల సమస్య పరిష్కారం కాకపోగా వారి జీవితాలు మరింత ప్రమాదంలోకి ఈ ప్రభుత్వం నెట్టివేస్తుంది.ఈ పరిస్థితులలోనే కేంద్ర విద్యుత్ సంస్కరణలు తెలంగాణ లో అమలు కాకుండా నిలిపివేసు కున్నప్పటికి భవిష్యత్ లో ఈ ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోవచ్చు.ఈ నేపథ్యంలో నే ప్రభుత్వం చెపుతున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టి విద్యుత్ సంస్ధలను కాపాడుకోకపోతే విద్యుత్ వెలుగులు మాయమై కారు చీకట్లు అలుముకోవడం తధ్యం.
– పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192




