కారు ఇక  కాంటాకే

కమీషన్‌ల కోసం అన్ని మిషన్‌లు 
పాలించమంటే పదేళ్ళు ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారు
ఆర్‌ఆర్‌ఆర్‌ను లక్ష మెజారిటీలో గెలిపించాలి
మంత్రి పొంగులేటి
కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : తెలంగాణను పాలించమని ప్రజలు పదేళ్ళు అధికారం ఇస్తే ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారని, గడీల పాలనను బద్దలు కొట్టి గద్దె దింపగానే మళ్ళీ ప్రజలు గుర్తుకు వచ్చారా అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. ఓడిపోయి నాగులు నేలలు గడుస్తున్నా అధికార దాహం తగ్గలేదనని, అధికారం కోసం రోడ్డెక్కేరాని ఎద్దేవ చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పడు ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ముసలి కన్నీరు కార్యడం సిగ్గు చేటు అని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు అమలు చేశామని గుర్తు చేశారు. రూ 46వేల కోట్లతో మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఎంత మందికి  ఇచ్చారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో రూ వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రైతులకు సాగు నీరు అందకుండా చేశారని, సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15 లోగా రూ 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
బిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణను దోచుకున్నారని, అధికారం పోగానే ఎన్నికల ములందు మళ్ళీ రాజీనామా డ్రామాలు అడుతున్నారంటూ చురకలు అంటించారు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడే న్కెతిక హక్కు బిఆర్‌ఎస్‌ లేదని విమర్శించారు. ఫోన్‌ ట్యాప్‌ంగ్‌ వ్యవహారంలో ఎంతటివారైనా జేలుకు పోడం ఖాయం అన్నారు. గతంలో బిఆర్‌ఎస్‌ పార్టీ మాయమాటలు నమ్మి ఇతర పార్టీ నుండి బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన నేతలు అక్కడ ఉండలేక తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారందరిని సాదరంగా ఆహ్వాన పలుకుతున్నామని స్పష్టం చేశారు.గత అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులో భాగంగా మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించడంతో కాంగ్రెస్‌ శ్రేణులు నిరాశ చెందాయని, కానీ ఒక్క పిలుపుతో గెలుపును తమ భుజాలపై వెనుకుని మాట నిలబెట్టిన నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘరామ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని, తద్వారా రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత అసెంబ్లీ ఎన్నికలలో పది అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని బిఆర్‌ఎస్‌ పార్టీకి తగిన గుణపాఠం చేప్పారు అన్నారు. కాలేశ్వరంపై విచారణ జరుగుతోందన్నారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికలలో కారు పార్టీని కాంటాకు పెట్టే సమయం వచ్చిందన్నారు.
ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా బిజెపి ప్రయత్నిస్తుందని,విభజన హామీ చట్టం ప్రకారం కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదన్నారు. బిఆర్‌ఎస్‌, బిజెపి రెండు ఒకటే అన్నారు. దేశ ప్రధానిగా అయ్యే అవకాశం రెండుసార్లు వచ్చిన మన్మోహన్‌ సింగ్‌కి అవకాశం కల్పించిన ఘనత సోనియాగాంధీ అన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి చేసే ఇండియా కూటమిని అత్యధిక మెజారిటీలో అధిక స్థానాల్లో గెలిపించాలని అభ్యర్థిచారు. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్‌ 14  నుండి15 సీట్ల గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.విజయంలో ఖమ్మం పార్లమెంట్‌ స్థానం మొట్టమొదటి వరుసలో ఉంటుందన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఖమ్మం పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి అత్యధిక మెజారిటీతో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చ్కెర్మన్‌ కంచర్ల చంద్రశేఖర రావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొడెం వీరయ్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, సిపిఎం రాష్ట్ర నాయకులు కసాని ఐలయ్య,సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, మచ్చ వెంకటేశ్వర్లు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు తూము చౌదరి ఆళ్ళ మురళి నాగేంద్ర త్రివేది పెద్దబాబు చీకటి కార్తీక్‌ ఎడవెల్లి కృష్ణ, కోనేరు సత్యనారాయణ, ఐ ఎన్‌ టి యు సి నాయకులు త్యాగరాజన్‌, ఆల్బర్ట్‌ ఎండి రజాక్‌, విప్లవ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త తుళ్లూరు బ్రహ్మయ్య టీజేఎస్‌ నాయకులు రామనాథం సుందర్లాల్‌ కోరి అన్నగారు బాల ప్రసాద్‌ వెంకటేష్‌ రియాజ్‌ అహ్మద్‌ కనకరాజు అమ్ములు రాజు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *