కాంగ్రెస్ పాలనలోనే పరిశ్రమలు..

  • అబద్ధపు హామీలిచ్చిన బిఆర్ఎస్ ను గద్దె దింపారు
  • కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి: డిప్యూటీ సీఎం  బట్టి విక్రమార్క 
కొత్తగూడెం, ప్రజాతంత్ర : మన నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే రాష్ట్రం  ఏర్పడ్డాక గత ప్రభుత్వం రూ7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని డిప్యూటీ సీఎం  బట్టి విక్రమార్క    విమర్శించారు.  ఖమ్మం కాంగ్రెస్  ఎంపీ అభ్యర్ధి రామసహాయం రఘురామ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ పాల్వంచ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన పరిశ్రమలు తప్ప కొత్తగా వచ్చినవి ఏమీ లేవన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియాగాంధీకి దక్కుతుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కెసిఆర్ ప్రకటించిన  దళితులకు మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అబద్దపు హామీలతో ప్రజలను మోసగించారని  గుర్తు చేశారు.
కరోనా సమయంలో రాష్ట్ర ప్రజలు సరియైన వైద్య అందుబాటులో లేక ఎంతో మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ 10 లక్షల వైద్య సదుపాయం కల్పించామన్నారు. రాష్ట్రంలో  65 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చామని, రైతులకు రూ 2 లక్షల రుణమాఫీ ఎన్నికల అనంతరం అందిస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో కేసీఆర్ చెప్పిన అబద్ధపు మాటలు నమ్మకే రాష్ట్ర ప్రజలు బిఆర్ ఎస్ ను బండ కేసు కొట్టినట్టు బాదారని ఏదేవ చేశారు.
ఖమ్మంలో మీఆటలు సాగమని… 
ఎన్నికలు ముగిశాఖ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3500 డబల్ బెడ్ రూమ్ ఇల్లు,  ఇంటి స్థలం ఉన్నవారికి రూ 5 లక్షలు పంపిణీ చేస్తామ్మారు. సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని, సంస్థ ఆస్తులని కాపాడుతామని ప్రతి కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎన్నికల కోడ్ అమరులు కారణంగా ప్రభుత్వ పథకాలు ప్రకటించలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని కోరారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటితో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *