విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , అమిత్ షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్ చేసి చూపింది. బిజెపి రాజకీయాల తీరు కాంగ్రెస్ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి అనేక నిర్ణయాలు ఉదాహరణగా నిలుస్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో అధికారమే లక్ష్యంగా మోదీ ద్వయం అడుగులు వేస్తోంది. మన్మోహన్ సింగ్‌ను కీలుబొమ్మ ప్రధానమంత్రిగా అభివర్ణించిన వారే మోదీ హయాంలో ఇప్పుడంతా కీలుబొమ్మలుగా మారారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఐదు రాష్టాల్ర ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి తనకు తిరుగులేదన్న సంకేతాలు ఇచ్చింది. ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై పెద్దా ప్రభావం చూపవని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లాంటి వారు కొట్టి పారేసినా.. ప్రజల్లో నాటుకున్న భావనలను మాత్రం తోసిపుచ్చలేం. తాజా పరిస్థితులు, బిజెపి వేస్తున్న అడుగులు మరోమారు విజయంపై ధీమాలో కమలనాథులు ఉన్నారు. బీజేపీకి జాతీయ స్థాయిలో మరింత బలాన్ని ఇచ్చింది. అలాగే రేపు జరగగబోయే వివిధ రాష్టాల్ర ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికలు కూడా బూస్ట్ కానుంది. తెలంగాణ లాంటి రాష్టాల్ల్రో మున్ముందు మేలు చేస్తుందనే భావన ఉంది. ఈశాన్య రాష్టాల్ర ఫలితాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేక పోయినా.. దేశంలో అంతటా బిజెపికి బలం ఉందని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. చిన్న రాష్టాల్రనైనా గుప్పిట పెట్టుకోవాల్సిందే అన్నది బిజెపి రాజకీయం. దేశ రాజకీయాలు ప్రధానంగా ఉత్తర భారతదేశం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టే ఇటు ఈశాన్య రాష్టాల్రను జాతీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ లోక్‌సభ స్థానాలు కూడా చాలా తక్కువ కావడం అందుకు మరో కారణం. కానీ బిజెపి వొచ్చాక ఈ చిన్న రాష్టాల్ల్రో కూడా పాగా వేయాలన్న లక్ష్యంతో పనిచేసింది. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా పాగా వేయాలన్న పట్టుదలతో పనిచేసి 8 అసెంబ్లీ సీట్లను సాధించింది. అందుకే తెలంగాణపై వొచ్చే ఎంపి ఎన్నికల కోసం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాని మోదీ ఇక్కడ అనేక అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించడంలో ఔచిత్యం కూడా ఇదే. ఎపిలోనూ పాగా వేయకున్నా బలపడాలన్న పట్టుదలతో ఉంది. ఇక లిక్కర్ స్కామ్‌లో దూకుడు వెనక ఎమ్మెల్సీ కవితను కూడా ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అటు ఎపిలోనూ ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడిని చేర్చడం ద్వారా అక్కడా రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాల్లో బిజెపి ఉంది. దిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్‌నకు డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా సహకరించారని, సౌత్ గ్రూపులో కవిత కూడా ఉందని ఈడీ, సీబీఐలు చార్జ్ షీట్స్ కూడా దాఖలు చేశాయి. సిసోడియా ఆఫీసులోనే కొత్త మద్యం పాలసీ డ్రాప్ట్ తయారైందని సీబీఐకి పక్కా ఎవిడెన్స్ దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో కవిత అరెస్ట్ తప్పదని బీజేపీ వర్గాలు బలంగా వాదిస్తున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ పొత్తు తప్పకపోవచ్చన్న సంకేతాల కారణంగా దానిని నిర్వీర్యం చేయడం ద్వారా కాంగ్రెస్‌తో తలపడాలిన బీజేపీ యోచిస్తోంది. . కవిత అరెస్ట్ అయితే రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా… బీఆర్‌ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుందా, కాంగ్రెస్`బీఆర్‌ఎస్ కలిస్తే బీజేపీకి ఛాన్స్ ఉంటుందా… అన్నది వేరు విషయం. అయితే ప్రస్తుత సవిూకరణాలను మాత్రం బిజెపి బాగా అధ్యయనం చేయడం ద్వారా రానున్న ఎన్నికల నాటికి బలోపేతం కావాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. వీటన్నింటిపై చర్చించేందుకే అమిత్ షా బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఉన్న అగ్ర నాయకత్వాన్ని దిల్లీ పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అమిత్ షా రాష్ట్ర రాజకీయాల్లో తరచూ జోక్యం చేసుకుని ఎలా ముందుకు వెళ్లాలో సూచిస్తున్నారు. విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , అమిత్ షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్ చేసి చూపింది. బిజెపి రాజకీయాల తీరు కాంగ్రెస్ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి అనేక నిర్ణయాలు ఉదాహరణగా నిలుస్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో అధికారమే లక్ష్యంగా మోదీ ద్వయం అడుగులు వేస్తోంది. మన్మోహన్ సింగ్‌ను కీలుబొమ్మ ప్రధానమంత్రిగా అభివర్ణించిన వారే మోదీ హయాంలో ఇప్పుడంతా కీలుబొమ్మలుగా మారారు.
మోదీ హయాంలో బిజెపి కూడా కాంగ్రెస్ మాదిరే అధిష్ఠానవర్గాన్ని అత్యంత బలోపేతంగా మార్చి ప్రజలు, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల అభిప్రాయానికి విలువలేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నది. మోదీ హవా కూడా ఆయన ఆకర్షణ వోట్లు తేగలిగినంత కాలమే సాగుతుంది. స్థానికంగా బలహీనులైన, కీలుబొమ్మలైన నేతలను ప్రోత్సహిస్తే కేంద్రం బలహీనపడ్డప్పుడు తదనుగుణంగా రాష్టాల్ర స్థాయిలో కూడా బిజెపి కుప్పకూలిపోతుంది. అయితే ఇకముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపైనే భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఇటీవలి వరుస ఎన్నికల్లో బిజెపి మరింత బలపడుతుందే తప్ప బలహీనం కావడం లేదు. విపక్షాల్లో అనైక్యతే బిజెపి బలంగా మారింది. ఇండియా కూటమి బలహీనతపైనే జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు ప్రయత్నాలు బలపడడం లేదు. అంతా కాంగ్రెస్ చుట్టే తిరుగుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న పార్టీలు ఒక్క తాటిపైకి రావడానికి కసరత్తు కూడా పెద్దగా జరగడం లేదు. బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కూడా అవకాశం కోసం చూస్తున్నాయి. బిజెపిని నిలువరించాలని అనుకుంటున్న శక్తులను కూడగట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ చూస్తున్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలు జట్టుగా బీజేపీపై రాజకీయ పోరాటం కోసం ఎజెండా సిద్ధం చేసే కసరత్తు చేస్తే తప్ప ఫలితం ఉండదు. బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుపై మరింత వేగం పెంచే అవకాశం కోసం చూస్తున్నాయి.
`ప్రజాతంత్ర డెస్క్





