కాంగ్రెస్‌ గూటికి గూడెం మహిపాల్‌ రెడ్డి

సిఎం రేవంత్‌ వెంట దిల్లీకి చేరుకున్న ఎమ్మెల్యే

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌25: బీఆర్‌ఎస్‌ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ లో చేరగా.. తాజాగా పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ చేరేందుకు సిద్ధమయ్యారు.  సీఎం రేవంత్‌ వెంట దిల్లీ వెళ్లిన మహిపాల్‌ రెడ్డి ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరనున్నారు.

ఎన్నికల ముందు  ఖ్కెరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌ పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌ రావు కాంగ్రెస్‌ కండువా కప్పుకోగా.. ఎన్నికల ఫలితాల తర్వాత పోచారం, సంజయ్‌ కుమార్‌ పార్టీలో చేరారు. గూడెం మహిపాల్‌ కాంగ్రెస్‌ లో చేరితే బీఆర్‌ఎస్‌ ను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 6 కు చేరుతుంది.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి   ఇళ్లు, ఆఫీసుల్లో  ఇటీవల  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్కెరెక్టరేట్‌(ఈడీ) అధికారులు దాడులు చేశారు. అక్రమ మైనింగ్‌తో రూ.300 కోట్లు కూడబెట్టారని గుర్తించినట్టు తెలిపారు. ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో చెల్లించాల్సిన మరో రూ. 39.08 కోట్లు ఎగవేసినట్టు వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *