ఐఐటి హైదరాబాద్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం

వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తమిళి సై

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : ఐఐటీ హైదరాబాద్‌ను జమ్ము కాశ్మీర్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌గా పాల్గొన్న కార్యక్రమంలో జాతికి అంకితం చేశారు. 2008 ఆగస్టు 18న ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఐఐటీ హైదరాబాద్‌ ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు కోసం కంది గ్రామంలో 576 ఎకరాలు కేటాయించగా, ఫిబ్రవరి 27, 2009లో అప్పటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

20 వేల మంది విద్యార్థులతో పాటు 10వేల మంది బోధన, ఇతర సిబ్బంది కోసం క్యాంపస్‌ నిర్మాణాన్ని 2010లో ప్రారంభించారు. భారత ప్రభుత్వం, జపాన్‌కు చెందిన జైకా సంస్థ కలిసి 2019 వరకు మొదటి దశ నిర్మాణం పనులు పూర్తి చేశాయి. జూలై 2015లో ఐఐటీ హైదరాబాద్‌ను ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ నుంచి కందిలోని శాశ్వత క్యాంపస్‌లోకి మార్చారు. మొదటి దశ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం, జపాన్‌కు చెందిన జైకా కలిసి సుమారు రూ.1700 కోట్లు ఖర్చు చేశాయి. ఈ కర్యక్రమంలో గవర్నర్‌ తమిళి సై తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *